NTR : ఎన్టీఆర్, నీల్ అనుకున్న డేట్ కి వస్తారా..?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఓ పక్క ఎన్టీఆర్ దేవర 1 ని పూర్తి చేయాల్సి ఉంది. వార్ 2 కూడా లైన్ లో ఉంది. దేవర, వార్ 2 పూర్తి చేసేసరికి
- By Ramesh Published Date - 08:15 AM, Sat - 10 August 24
NTR ఎన్టీఆర్ ప్రశాంత్ నీఎల్ కాంబో సినిమా కొన్నాళ్లుగా చర్చల్లో మాత్రమే ఉంది. ఐతే శుక్రవారం ఆ సినిమా పూజా కార్యక్రమాలు చేసి సినిమా కన్ ఫర్మ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియదు కానీ ఎన్ టీ ఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు పూజా కార్యక్రమలో పాల్గొన్నారు. ఐతే ఈ సినిమా ముహుర్తం రోజే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్.
2026 జనవరి 9న ఎన్టీఆర్ (NTR) నీల్ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఐతే చెప్పడానికి రిలీజ్ అప్పుడని వేస్తారు కానీ అసలు ఆ డేట్ కి సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుందా అన్న సందేహం మొదలైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఓ పక్క ఎన్టీఆర్ దేవర 1 ని పూర్తి చేయాల్సి ఉంది. వార్ 2 కూడా లైన్ లో ఉంది. దేవర, వార్ 2 పూర్తి చేసేసరికి ప్రశాంత్ నీల్ సినిమాకు టైం ఇవ్వడం లేట్ అవుతుంది.
Also Read : Rashmika : రష్మిక డెడికేషన్ సూపర్..!
వేయడానికి పోస్టర్ మీద డేట్ వేశారు కానీ సినిమా అసలు ఆ డేట్ కి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ఫ్యాన్స్. ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ రెండు భాగాలు సలార్ 1 తీసిన ప్రశాంత్ నీల్ ఓ పక్క సలార్ 2 (Salaar 2) ని ఎప్పుడు తీస్తాడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే సడెన్ గా ఎన్ టీ ఆర్ సినిమా పూజ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేశాక మళ్లీ దేవర 2 కోసం పనిచేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి స్టార్ సినిమాలు ఈ రెండు భాగాల వల్ల పెద్ద తలనొప్పి వచ్చి చేరింది.
Related News
Jagan Famous Dialogue in Devara : దేవర లో ‘జగన్’ డైలాగ్.. గమనించారా..?
Jagan Kulam Chudam Matham Chudam Dialogue : కులం లేదు, మతం లేదు, భయం లేదు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో దేవరను పరిచయం చేస్తారు