NTR : 18 కేజీలు తగ్గిన ఎన్టీఆర్..? ఏంటి దానికోసమే..?
NTR : ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా సహజసిద్ధంగా జరగిందని, ఎలాంటి మెడికల్ సహాయం లేకుండా కఠినమైన వ్యాయామాలు, నియమితమైన ఆహార నియమాలు పాటించి
- By Sudheer Published Date - 10:26 PM, Tue - 22 April 25

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన పాత్రల కోసం చూపించే డెడికేషన్ మరోసారి కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ కోసం ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్లు (NTR lost 18kgs in 5 Months) సమాచారం. ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పూర్తిగా సహజసిద్ధంగా జరగిందని, ఎలాంటి మెడికల్ సహాయం లేకుండా కఠినమైన వ్యాయామాలు, నియమితమైన ఆహార నియమాలు పాటించి ఆయన ఇది సాధించారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
TDP Leader Murder : టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య..!
చాల గ్యాప్ తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తన పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే శరీరాకృతిలో ఈ స్థాయి మార్పులు తీసుకువచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని టాక్. యాక్షన్, ఎమోషన్ కలగలిపే కథతో ‘డ్రాగన్’ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుందని చిత్ర బృందం అంటోంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈరోజు ‘డ్రాగన్’ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని సమాచారం. కొత్త లుక్‌లో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి అధికారిక అప్‌డేట్స్ త్వరలోనే రిలీజ్ కానున్నాయి.