NTR : బామ్మర్ది నార్నె నితిన్ పై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్.. నా పెళ్లి అప్పుడు చిన్న పిల్లాడు.. అస్సలు మాట్లాడేవాడు కాదు..
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ తన బామ్మర్ది నార్నె నితిన్ గురించి మాట్లాడుతూ..
- By News Desk Published Date - 08:59 AM, Sat - 5 April 25

NTR : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా వరుస సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నాడు. ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నవ్వించి పెద్ద హిట్ కొట్టాడు నార్నె నితిన్. ఈ సినిమా ఇప్పటికే 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ తన బామ్మర్ది నార్నె నితిన్ గురించి మాట్లాడుతూ.. నా పెళ్లి అప్పుడు వీడు చాలా చిన్న పిల్లాడు. అస్సలు మాట్లాడేవాడు కాదు. నేను ఎంత ట్రై చేసినా మాట్లాడేవాడు కాదు. అతను ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడింది మొదటిసారి బావ.. నేను యాక్టర్ అవుతా అన్నాడు. నేనైతే సపోర్ట్ చెయ్యను నీ సావు నువ్వు సావు అని అన్నాను. అతనికి నేను ఏమి చెప్పలేదు. తనని కూడా ఏం చేస్తున్నావో నాకేమి చెప్పక్కర్లేదు అన్నాను. కానీ ఇవ్వాళ ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో మరిన్ని సక్సెస్ లు చూడాలి. మనం మిగతాది ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని అన్నారు.
దీంతో బామ్మర్ది గురించి ఎన్టీఆర్ ఇలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక నార్నె నితిన్ కూడా.. మా బావ ఈ సినిమా చూసాక నీ యాక్టింగ్ లో ఇంకా ఈజ్ పెరిగింది అని అభినందించినట్లు తెలిపాడు.
Also Read : Pawan Kalyan : భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు పవన్ కళ్యాణ్.. ఏపీ తరపున ముత్యాల తలంబ్రాలు..