NTR : జూ. ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటున్నారో తెలుసా..?
NTR : భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు
- By Sudheer Published Date - 07:38 PM, Sat - 28 December 24

మరో రెండు రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) జరుపుకునేందుకు అంత సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చాలామంది ఆ ఏర్పాట్లలో ఉన్నారు. సినీ , బిజినెస్ , రాజకీయరంగ ప్రముఖులు ఎక్కువగా విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంటారు. ఈ ఏడాది కూడా అలాగే జరుపుకునేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విదేశాలకు వెళ్లగా..తాజాగా జూ ఎన్టీఆర్ (NTR) సైతం విదేశాలకు ఫ్యామిలీ తో కలిసి వెళ్లినట్లు తెలుస్తుంది.
భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ తన బిజీ షెడ్యూల్‌లో నుంచి కాస్త విరామం తీసుకుని కుటుంబంతో గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 (War 2)సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రీసెంట్ గా దేవర తో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Read Also : Formula E Racing Case : ‘ఫార్ములా ఈ కార్ రేస్’ చెల్లింపులతో నాకు సంబంధం లేదు.. హైకోర్టులో కేటీఆర్ కౌంటర్