NTR Vs Rajinikanth : రజినీతో ఎన్టీఆర్ ఢీ.. రసవత్తరంగా పోటీ..!
NTR Vs Rajinikanth ఫెస్టివల్ టైం లో స్టార్ సినిమాల మధ్య ఫైట్ తెలిసిందే. సంక్రాంతి ఫైట్ ముగిసింది కదా అనుకుంటే సమ్మర్ రేసులో స్టార్ సినిమాలు వస్తాయని అనుకున్నారు కానీ ఈ సమ్మర్ చాలా చప్పగా
- By Ramesh Published Date - 01:32 PM, Sat - 13 April 24

NTR Vs Rajinikanth ఫెస్టివల్ టైం లో స్టార్ సినిమాల మధ్య ఫైట్ తెలిసిందే. సంక్రాంతి ఫైట్ ముగిసింది కదా అనుకుంటే సమ్మర్ రేసులో స్టార్ సినిమాలు వస్తాయని అనుకున్నారు కానీ ఈ సమ్మర్ చాలా చప్పగా ఉండబోతుంది. మే 9న కల్కి రాకపోతే మాత్రం సమ్మర్ ని వృధా చేసినట్టే అవుతుంది. ఇక ఇదిలాఉంటే ఆగష్టులో పుష్ప రాజ్ హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు 15న పుష్ప 2 ఆగమనం కన్ ఫర్మ్ అయ్యింది.
రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు పుష్ప మేకర్స్. ఇక దసరాకి ఖర్చీఫ్ వెశాడు దేవర. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. దసరాకి తారక్ రావడంతో మిగతా వారంతా కూడా సైడ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఎన్టీఆర్ తో ఢీ కొట్టేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ సిద్ధమవుతున్నాడు. జైలర్ తర్వాత రజినీ చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. టీజే జ్ఞానవెల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేటయ్యాన్ టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే అక్టోబర్ లో రజిని వర్సెస్ ఎన్టీఆర్ రసవత్తరమైన పోటీ ఉండనుంది.
ఎన్టీఆర్ దేవర మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా ఫ్యాన్స్ అందరినీ కలార్ ఎగురవేసేలా ఉంటుందని అని చెప్పగా వేట్టయాన్ కూడా రజిని మార్క్ మాస్ యాక్షన్ మూవీగా వస్తుందని టాక్. దసరా బరిలో ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.
Also Read : Manchu Manoj : తండ్రైన మంచు మనోజ్