NTR Devara Release Date : దేవర డేట్ పై కన్నేసిన ఆ ఇద్దరు..!
NTR Devara Release Date ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అనుకోగా ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం కష్టమే అని
- By Ramesh Published Date - 08:08 AM, Wed - 24 January 24

NTR Devara Release Date ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అనుకోగా ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం కష్టమే అని అంటున్నారు. దేవర సినిమా విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా అనుకున్న విధంగా రావాలంటే రిలీజ్ డేట్ టార్గెట్ లేకుండా చేసుకోవాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా భారీగా ఉంటుందని అందుకే సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కష్టమని అంటున్నారు.
అయితే దేవర రిలీజ్ డౌట్ అనగానే ఆ డేట్ న రిలీజ్ చేసేలా మరో రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ కాగా మరొకటి సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ అసలైతే సంక్రాంతికి రావాలి కానీ సంక్రాంతి సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమని సినిమా వాయిదా వేసుకున్నారు.
ఇక ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ రిలీజ్ అనుకోగా ఆ డేట్ ఈగల్ కి ఇవ్వడంతో ఇప్పుడు దేవర రిలీజ్ అనుకున్న డేట్ ఏప్రిల్ 5న టిల్లు స్క్వేర్ కూడా వచ్చేలా ఉన్నాడు. స్టార్ సినిమా సైడ్ ఇస్తే చాలు యువ హీరోల సినిమాలు ఆ డేట్ ని ఆక్యుపై చేస్తారు. దేవర రిలీజ్ దాదాపు వాయిదా పడినట్టే అందుకే ఈ మూవీస్ ఆ రోజున రావాలని చూస్తున్నాయి.
Also Read : Shah Rukh Khan: సల్మాన్ ను బీట్ చేసిన షారుక్ ఖాన్, ఇదిగో అప్డేట్