NTR : ఎన్టీఆర్ ని బాలీవుడ్ లో చూడాలంటే ఇంకాస్త ఎదురుచూడాల్సిందే.. హృతిక్ రోషన్ వల్లే..
ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ పక్క ప్రశాంత్ నీల్ సినిమా, మరో పక్క వార్ 2 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
- By News Desk Published Date - 09:50 AM, Tue - 11 March 25

NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ పక్క ప్రశాంత్ నీల్ సినిమా, మరో పక్క వార్ 2 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో ముంబై లో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ షూటింగ్ వాయిదా పడింది.
ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఇద్దరూ ఉంటారు. వీరిద్దరిపై కలిపి ఒక డ్యాన్స్ సాంగ్ వార్ 2 లో పెడుతున్నారు అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హృతిక్ రోషన్ కి గాయాలు అయ్యాయని సమాచారం. దీంతో హృతిక్ నెల రోజులు పాటు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పారట. ఇంకేముంది దీంతో ఆ సాంగ్ షూట్ కాస్త వాయిదా పడింది.
వార్ 2 సినిమా ఇండిపెండ్స్ డేకి ఆగస్టులో రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ ని బాలీవుడ్ సినిమాలో ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హృతిక్ గాయంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏదో వారం, పది రోజులు అంటే డేట్స్ అడ్జస్ట్ చేయొచ్చు కానీ నెల రోజులు అంటే కష్టమే అని తెలుస్తుంది. ఈ లోపు ఎన్టీఆర్ నీల్ సినిమాతో బిజీ అయితే మళ్ళీ వార్ 2 సినిమాకి డేట్స్ ఇవ్వడం కష్టం అవుద్ది.
ఈ లెక్కన సినిమా చెప్పిన డేట్ కి రాదేమో, వార్ 2 వాయిదా పడుతుందేమో, ఎన్టీఆర్ ని బాలీవుడ్ సినిమాలో చూడటానికి మరింత వేచి చూడాలి ఏమో అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఎన్టీఆర్ – హృతిక్ ఇద్దరు స్టార్ డ్యాన్సర్లు కలిసి చేసే డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also Read : Samantha : ముచ్చటగా మూడోసారి.. బెస్ట్ ఫ్రెండ్ తో సమంత సినిమా.. ఈసారి మాత్రం రీమేక్ కాదు..