NTR – Ram Charan ఎన్టీఆర్ తర్వాత చరణ్.. ఇద్దరి చేతుల్లోనే జాన్వి కెరీర్..!
NTR - Ram Charan బాలీవుడ్ లో వరుస సినిమాలతో సత్తా చాటుతున్న జాన్వి కపూర్ ఇప్పుడు సౌత్ సినిమాల మీద ఫోకస్ చేసింది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో దేవర సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న అమ్మడు
- Author : Ramesh
Date : 22-03-2024 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
NTR – Ram Charan బాలీవుడ్ లో వరుస సినిమాలతో సత్తా చాటుతున్న జాన్వి కపూర్ ఇప్పుడు సౌత్ సినిమాల మీద ఫోకస్ చేసింది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో దేవర సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న అమ్మడు ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో ఛాన్స్ అందుకుంది. చిరంజీవి, శ్రీదేవి జోడీ లానే చరణ్, జాన్వి కపూర్ ల జంట కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. నార్త్ లో తన టాలెంట్ చూపిస్తూ దూసుకెళ్తున్న జాన్వి కపూర్ సౌత్ కెరీర్ మన తెలుగు హీరోల చేతుల్లోనే ఉంది.
ముందు ఎన్టీఆర్ దేవర ఆ తర్వాత చరణ్ సినిమా. ఈ రెండు సినిమాలతోనే జాన్వి సౌత్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా జాన్వి కపూర్ కి మంచి పాత్రలే దొరికినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ దేవర రెండు భాగాలుగా వస్తుంది. ఈ సినిమా తప్పకుండా అంచనాలను మించి ఉండబోతుంది. చరణ్ తో బుచ్చి బాబు చేసే సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుంది.
ఎన్టీఆర్ ఆ వెంటనే చరణ్ టాలీవుడ్ ఇద్దరు స్టార్స్ తో జాన్వి తెలుగు గ్రాండ్ ఎంట్రీ షురూ అయ్యింది. మరి శ్రీదేవి తరహాలో తెలుగు ఆడియన్స్ ను జాన్వి తన మాయలో పడేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. దేవర సినిమా షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెబుతున్న జాన్వి తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ చూస్తే మాత్రం ఇక్కడే ఉండిపోతుందని చెప్పొచ్చు.
Also Read : Ram Charan Tang Changed : చరణ్ ట్యాగ్ మారింది మెగా ఫ్యాన్స్ గమనించారా..?