HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr 30 Update Janhvi Kapoor Locked Jr Ntr Movie

NTR 30 EXCLUSIVE: క్రేజీ అప్ డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్.. త్వరలో ఫొటోషూట్!

ఎన్టీఆర్ 30లో తారక్ సరసన కథానాయికగా నటించేందుకు జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యింది.

  • Author : Balu J Date : 13-02-2023 - 4:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janhvy And Jrntr
Janhvy And Jrntr

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2018లో ధడక్‌తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. మిలీ, గుంజన్ సక్సేనా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆ రెండు సినిమాలు ఆశించినంతస్థాయిలో ఆడలేదు. తాజాగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. జాన్వీ త్వరలో తన ‘డ్రీమ్ యాక్టర్’ జూనియర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. RRR నటుడితో (ఎన్టీఆర్) కలిసి పని చేయాలనే జాన్వీ కోరిక ఎట్టకేలకు నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది.

ఎన్టీఆర్ 30లో తారక్ సరసన కథానాయికగా నటించేందుకు ఈ నటి ఎంపికైనట్లు సమాచారం. గత సంవత్సరం ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ..  జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుంది అని వెల్లడించింది. అప్పటి నుండి జాన్వీ తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్‌తో సంభాషణలు జరుపుతోంది.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా నటించేందుకు జాన్వీ రెడీ అయినట్టు లేటెస్ట్ సమాచారం.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్‌కు టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో ఫోటోషూట్ ద్వారా జాన్వీ అఫిషీయల్ గా ప్రకటించే అవకాశం ఉంది. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించే చిత్రం ఇదేనని కూడా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా విజయంతో జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుండటం, పాన్ ఇండియా గా రూపుదిద్దుకుంటుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  కొద్దిరోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ 2024లో విడుదల కానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల (Koratala) చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ కావడం, దర్శకుడి వైఫల్యం అని మెగాస్టార్ రెండుసార్లు  చెప్పడంతో కొరటాల డైలమాలో పడిపోయాడు.

#NTR30 సినిమా ఆలస్యమవుతుండటం హట్ టాపిక్ గా కూడా మారింది. వాస్తవానికి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది.  కానీ కొరటాల పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు (Janhvi Kapoor) గుడ్ లక్ జెర్రీ (OTT విడుదల), మిలీ వంటి బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌లు ఆమెను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ సమయంలో తెలుగు అవకాశాలను వదులుకోవడం మంచిది కాదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో జాన్వీ టాలీవుడ్ పై ఫోకస్ చేసినట్టు సమాచారం. ఈ కాంబోను డైరెక్టర్ కొరటాల శివ బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janhvi Kapoor
  • jr ntr
  • latest tollywood news
  • NTR30

Related News

Jr NTR

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

Trending News

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd