Gutka Advertisements: బాలీవుడ్ హీరోలకు మోడీ షాక్
మోడీ ప్రభుత్వం బాలీవుడ్ తరాలకు షాకిచ్చింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.బాలీవుడ్ హీరోలు ఖారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ లనోటీసులు జారీచేసింది. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తులు, గుట్కా లాంటి వాణిజ్య ప్రచారాలు
- By Praveen Aluthuru Published Date - 01:16 PM, Mon - 11 December 23

Gutka Advertisements: మోడీ ప్రభుత్వం బాలీవుడ్ తరాలకు షాకిచ్చింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.బాలీవుడ్ హీరోలు ఖారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ లనోటీసులు జారీచేసింది. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తులు, గుట్కా లాంటి వాణిజ్య ప్రచారాలు, ప్రకటనల్లో పాల్గొంటున్నారంటూ గత సంవత్సరం అలహాబాద్ హైకోర్టులో లో పిటిషన్ దాఖలు చేశారు మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు , సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు ఇటువంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోమారు పిటిషనర్ మోతీలాల్ యాదవ్ కోర్టును ఆశ్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు.
అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్గన్ లకు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామంటూ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు సమాచారం అందించారు. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నా సదరు గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని దీంతో అమితాబ్ ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపారని పాండే కోర్టుకు తెలియజేశారు. ఇరువురు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.
Also Read: 191st Birthday : ‘జొనాథన్’.. 191వ బర్త్ డే సెలబ్రేషన్స్