191st Birthday : ‘జొనాథన్’.. 191వ బర్త్ డే సెలబ్రేషన్స్
191st Birthday : ‘జొనాథన్ ది టార్టాయిస్’ (Jonathan the tortoise).. ఈ సంవత్సరం 191వ బర్త్ డేను చేసుకుంటోంది.
- Author : Pasha
Date : 11-12-2023 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
191st Birthday : ‘జొనాథన్ ది టార్టాయిస్’ (Jonathan the tortoise).. ఈ సంవత్సరం 191వ బర్త్ డేను చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన జంతువుగా ఇది ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్‌లో 1832లో ఈ తాబేలు జన్మించింది. 1882లో దీన్ని సీషెల్స్ దేశం నుంచి దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సెయింట్ హెలెనా ద్వీపానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ‘జొనాథన్ ది టార్టాయిస్’ వయస్సు 50 సంవత్సరాలు. ప్రపంచంలోని చాలా తాబేలు జాతులు ఇప్పటివరకు గరిష్టంగా 150 ఏళ్లు మాత్రమే బతుకుతున్నాయి. అయితే ‘జొనాథన్ ది టార్టాయిస్’ ఆ రికార్డులను చెరిపేసి డిసెంబరు 4న 191వ వసంతంలోకి అడుగుపెట్టాడు.కెప్టెన్ జేమ్స్ కుక్.
‘టుయ్ మలిలా’..
1777 సంవత్సరంలో టోంగా దేశ రాజ కుటుంబానికి ‘టుయ్ మలిలా’ అనే పేరు కలిగిన తాబేలును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తాబేలు 188 సంవత్సరాల వయసులో 1965లో చనిపోయింది. 2021 సంవత్సరంలో 189 ఏళ్ల వయసుకు చేరడం ద్వారా ‘టుయ్ మలిలా’ ఆయుర్దాయం రికార్డును ‘జొనాథన్ ది టార్టాయిస్’ బద్దలు కొట్టింది. ఈ తాబేలు జీవితకాలంలో(191st Birthday) ఎనిమిది మంది బ్రిటీష్ చక్రవర్తులు, 40 మంది అమెరికా అధ్యక్షులు మారారు.
We’re now on WhatsApp. Click to Join.
‘జొనాథన్ ది టార్టాయిస్’ను చూసుకుంటున్న పశువైద్యుడి ప్రకారం.. ఈ పెద్ద తాబేలు ఇప్పటికీ హుషారుగా ఉంటుంది. వాసన చూసే గుణాన్ని ఇది కోల్పోయింది. కంటిశుక్లం సమస్యతో ఈ తాబేలు చూపును కోల్పోయింది. అయితే జీర్ణ వ్యవస్థ బెటర్‌గా ఉండటంతో దాని ఆకలి మాత్రం ఇంకా తగ్గలేదు. ఒక స్పెషల్ టీమ్ దీనికి వారానికి ఒకసారి చేతితో పండ్లు, కూరగాయలను తినిపిస్తుంటుంది. జోనాథన్‌కు ఇష్టమైన ఫుడ్స్ జాబితాలో క్యాబేజీ, దోసకాయలు, క్యారెట్లు, పాలకూర, యాపిల్స్, అరటిపండ్లు ఉన్నాయి.