Nitya Menon : కుమారి శ్రీమతికి పాజిటివ్ టాక్..!
నిత్యా మీనన్ (Nitya Menon) లీడ్ రోల్ లో స్వప్న సినిమాస్ బ్యానర్ లో వచ్చిన వెబ్ సీరీస్ కుమారి శ్రీమతి. అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 28 నుంచి ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్
- Author : Ramesh
Date : 01-10-2023 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
నిత్యా మీనన్ (Nitya Menon) లీడ్ రోల్ లో స్వప్న సినిమాస్ బ్యానర్ లో వచ్చిన వెబ్ సీరీస్ కుమారి శ్రీమతి. అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 28 నుంచి ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. గోమరేష్ ఉపాధ్యాయ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరీస్ కథను అవసరాల శ్రీనివాస్ అందించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ వెబ్ సీరీస్ (Web Series) ఓటీటీ ఆడియన్స్ ని అలరిస్తుంది.
తాతల కాలం నాటి ఇల్లుని దక్కించుకునేందుకు బాబాయ్ తో పోటీపడి కోర్టు మెట్లెక్కిన కుమారికి అది తాతల ఆస్తి కాబట్టి ఆరు నెలల్లో ఆ ఇంటిని 38 లక్షలు ఇచ్చి పొందవచ్చని తీర్పు ఇస్తాడు.
ఆ టైం లో 13 వేలు సంపాదించే కుమారి బార్ బిజినెస్ చేయాలని అనుకుంటుంది. స్నేహితుల ప్రోత్సాహాంతో బార్ పెడుతుంది. అయితే అనుకోని విధంగా ఆమెకు కొన్ని అవాంతరాలు వచ్చి పడుతుంటారు. ఇంతకీ కుమారి అనుకున్న విధంగా ఇంటిని సొంతం చేసుకుందా లేదా అన్నది వెబ్ సీరీస్ కథ.
ఏడు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. నరేషన్ లో అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా అవేవి సీరీస్ ని డిస్టర్బ్ చేయదు. ఇక నిత్యా మీనన్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ మరోసారి ఆమెని ప్రేక్షకులను దగ్గరయ్యేలా చేస్తుంది. నిత్యా మీనన్ వన్ మ్యాన్ షోగా ఈ సీరీస్ వచ్చింది. మిగతా పాత్రలు.. కెమెరా వర్క్.. డైరెక్షన్ ఇవన్నీ కూడా మెప్పిస్తుంది. కుమారి శ్రీమతి (Kumari Srimathi) వెబ్ సీరీస్ తో నిత్యా మీనన్ డిజిటల్ లో కూడా తన మార్క్ చూపించిందని చెప్పొచ్చు.
Also Read : Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా..?