Nitin Robinhood : పవర్ స్టార్ కి పోటీ వస్తున్న రాబిన్ హుడ్..!
Nitin Robinhood పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ లాక్ చేశారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నితిన్ రాబిన్ హుడ్ పోటీ వస్తాడా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వీరమల్లు
- Author : Ramesh
Date : 20-01-2025 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
Nitin Rabinhood లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ఆల్రెడీ భీష్మతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలిసి రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఛలో, భీష్మ రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ తో రాబిన్ హుడ్ అంటూ మరో క్రేజీ సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా కూడా వెంకీ మార్క్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను అసలైతే 2024 డిసెంబర్ చివర్లో రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరి లో సినిమాలు చాలా రిలీజ్ షెడ్యూల్ చేయడం వల్ల మార్చి చివర్లో సినిమా రిలీజ్ లాక్ చేశారు. మార్చి 28న నితిన్ రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ కి నితిన్ రాబిన్ హుడ్ పోటీ..
ఐతే ఆ డేట్ కి ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ లాక్ చేశారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నితిన్ రాబిన్ హుడ్ పోటీ వస్తాడా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదా పడుతుందా అన్న డౌట్ కూడా మొదలైంది. ఇప్పటికే నాలుగేళ్లుగా ఆ సినిమాను చెక్కుతూనే ఉన్నారు. మరి మళ్లీ పోస్ట్ పోన్ అంటే బాబోయ్ అనేయక తప్పదు.
నిజంగానే వీరమల్లుతో రాబిన్ హుడ్ పోటీకి దిగితే మాత్రం పవర్ స్టార్ అభిమానే అతనికి పోటీగా రంగంలోకి దిగాడని చెప్పుకుంటారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అప్పటికి వస్తుంది ఏది వాయిదా పడుతుంది అన్నది చూడాలి.
Venkatesh : నాన్ RRR రికార్డులను బద్ధలు కొట్టిన వెంకటేష్..!