Nitin : నితిన్ మంచి ఛాన్స్ మిస్..!
Nitin నితిన్ తో శ్రీలీల జత కట్టిన రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ నెల చివర రిలీజైతే మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉందేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఐతే ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్
- By Ramesh Published Date - 07:05 PM, Thu - 2 January 25

యువ హీరో నితిన్ ఒకేసారి రెండు సినిమాలు ఉంచాడు. అందులో ఒకటి వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ కాగా మరొకటి తమ్ముడు. రాబిన్ హుడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి తమ్ముడు వస్తుంది. ఐతే రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది.
పుష్ప 2 ప్రీమియర్ టైం లో థియేటర్ ఘటనలో మైత్రి మూవీ మేకర్స్ కూడా టెన్షన్ లో ఉన్నారు. ఆ టైం లో సినిమా రిలీజ్ ఎందుకని రాబిన్ హుడ్ ని ఆపేశారు. నితిన్ మాత్రం తన సినిమా రిలీజ్ చేయాలని గట్టి పట్టు పట్టాడు. నితిన్ సినిమా వస్తుందని మిగతా సినిమాలేఇ షెడ్యూల్ చేయలేదు. క్రిస్మస్ వీకెండ్ నితిన్ సినిమాకు లక్ కలిసి వచ్చే అవకాశం ఉండేది.
ఐతే క్రిస్మస్ వీక్ లో సుదీప్ మ్యాక్స్ రాగా అది తెలుగులో ఆశించిన స్థాయి రెస్పాన్స్ అందుకోలేదు. నితిన్ వచ్చి ఉంటే కచ్చితంగా మంచి స్కోప్ ఉండేది. భీష్మ తో సూపర్ హిట్ కొట్టిన నితిన్ వెంకీ కుడుముల కాంబో మళ్లీ రాబిన్ హుడ్ తో కలిసి పనిచేశారు. రాబిన్ హుడ్ టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ఉంది.
నితిన్ తో శ్రీలీల జత కట్టిన రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ నెల చివర రిలీజైతే మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉందేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఐతే ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ తమ్ముడు రిలీజ్ డేట్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.