National Award : నా కష్టానికి ప్రతిఫలం దక్కింది – నిత్య మేనన్
National Award : "నేషనల్ అవార్డు నా కష్టానికి ప్రతిఫలం. 10-15 ఏళ్లుగా చిత్ర సీమలో కొనసాగుతున్నాను. ఇది నేను సంబరాలు చేసుకోవాల్సిన సమయం" అని అన్నారు.
- By Sudheer Published Date - 08:12 AM, Wed - 9 October 24

National Awards 2024 లో దక్షణాది చిత్రాలు సత్తా చాటాయి. కాంతారా చిత్రంలోని నటనకు గాను రిషబ్ శెట్టి (Rishab Shetty )కి నేషనల్ అవార్డు (National Award) దక్కగా..కార్తికేయ 2 కు గాను ఉత్తమ చిత్ర అవార్డు దక్కింది. అలాగే జాతీయ ఉత్తమ నటిగా నిత్య మీనన్ అవార్డు అందుకున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీన నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలను వెల్లడించింది. గతేడాది అల్లు అర్జున్‍కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కగా.. ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీ 2024లో థియేటర్లలో రిలీజైనా.. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కగా.. ఈసారి కార్తికేయ 2కు మినహా మరే పురస్కారం దక్కలేదు. ఇకపోతే జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై నటి నిత్య మేనన్ (Nitya Menon) స్పందించారు. అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. “నేషనల్ అవార్డు నా కష్టానికి ప్రతిఫలం. 10-15 ఏళ్లుగా చిత్ర సీమలో కొనసాగుతున్నాను. ఇది నేను సంబరాలు చేసుకోవాల్సిన సమయం” అని అన్నారు. మంచి స్క్రిప్ట్‌తో వచ్చిన దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని , ఈ అవార్డును తన తోటి కోస్టార్స్కు, తిరుచిత్రంబలం మూవీటీమ్‌కు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అలాగే ‘పొన్నియిన్ సెల్వన్- 1’ చిత్రానికి గానూ ఉత్తమ సంగీతం (నేపథ్యం) విభాగంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత రెహమాన్ మాట్లాడుతూ – “ప్రాంతం, భాష, సినిమాకు ఎలాంటి హద్దులు లేవు. నా ఏడో జాతీయ అవార్డు ఇది. దీనికి కారకులైన ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా దర్శకుడు మణిరత్నానికి నా ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు.
Read Also : Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి