Nithiin Welcomed His First Child : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నితిన్ భార్య..
Nithiin Welcomed His First Child : కొద్దీ రోజుల క్రితం షాలిని గర్భం దాల్చిన విషయం బయటకు వచ్చింది. ఇక ఈరోజు మరో హీరో ఎంట్రీ ఇవ్వడం తో నితిన్ ఇంట సంబరాలు నెలకొన్నాయి
- Author : Sudheer
Date : 06-09-2024 - 7:10 IST
Published By : Hashtagu Telugu Desk
Nithiin Welcomed His First Child : టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin ) తండ్రి పోస్ట్ కొట్టేసాడు. నితిన్ భార్య షాలిని (Nithiin wife Shalini) శుక్రవారం పండంటి బాబు(Baby Boy)కు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్బంగా బాబు చేయి పట్టుకున్న ఫోటో ను నితిన్ షేర్ చేస్తూ..’మా ఫామిలీ న్యూ స్టార్ కు ఆహ్వానం’ అంటూ రాసుకొచ్చాడు.
2020 లో స్నేహితురాలినే పెళ్లి చేసుకున్న నితిన్
2020 జులై 26 న తన స్నేహితురాలు షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని. కొద్దీ రోజుల క్రితం షాలిని గర్భం దాల్చిన విషయం బయటకు వచ్చింది. ఇక ఈరోజు మరో హీరో ఎంట్రీ ఇవ్వడం తో నితిన్ ఇంట సంబరాలు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు నితిన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నాలుగేళ్లుగా ఒక్క హిట్ లేదు
ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. 2020 నుంచి ఒక్క హిట్ కూడా లేదు. ఈ రెండేళ్లలో ఐదు సినిమాలు చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి సినిమా నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని హిట్ దర్శకులతో వస్తున్నారు. తనకి చివరిగా ‘భీష్మ’తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసిన వేణు శ్రీరామ్ తో ‘తమ్ముడు’ (Tammudu ) అనే మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏకధాటిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రాబిన్ హుడ్ సినిమా కామెడీ హీస్ట్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తమ్ముడు చిత్రం విషయానికి వస్తే.. సిస్టర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. హీరోకి అక్కగా ఒకప్పటి హీరోయిన్ ‘లయ’ నటిస్తున్నారు. నితిన్ కి జోడిగా కాంతార భామ ‘సప్తమి గౌడ’ నటిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల ఫై నితిన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024
Read Also : School Holidays: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు