Nikhil : పది నిమిషాలకో ట్విస్ట్.. క్లైమాక్స్ ఎవరు ఊహించలేరట..!
Nikhil సుధీర్ వర్మతో స్వామిరారా లాంటి సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఐతే సైలెంట్ గా తీసిన ఈ సినిమా
- By Ramesh Published Date - 02:26 PM, Mon - 4 November 24

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత ఆ రేంజ్ సినిమాలు చేస్తాడని అనుకోగా సడెన్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) అంటూ ఒక మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాను సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేశాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎప్పుడు మొదలైంది.. షూటింగ్ ఎప్పుడు చేశారో తెలియదు కానీ నవంబర్ 8న రిలీజ్ కు రెడీ అయ్యింది.
ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ (Nikhil) సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహిచలేరని అన్నాడు. అంతేకాదు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని అన్నాడు. సుధీర్ వర్మతో స్వామిరారా లాంటి సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఐతే సైలెంట్ గా తీసిన ఈ సినిమా మాత్రం మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
సైలెంట్ గా పూర్తి చేశారా..
ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ గా నటించిన రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటితో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. అమ్మడు డైరెక్ట్ తెలుగు సినిమా ఇంత సైలెంట్ గా పూర్తి చేశారా అన్న డౌట్ కూడా మొదలైంది. ఏది ఏమైనా నిఖిల్, రుక్మిణి జంటగా చేసిన ఈ సినిమా ఎలాంటి థ్రిల్ కలిగిస్తుందో చూడాలి.
నిఖిల్ ఓ పక్క ఇండియా హౌస్, స్వయంభు అంటూ భారీ సినిమాలు చేస్తున్నాడు. వాటికి ముందు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ ఒక మంచి లవ్ స్టోరీ విత్ ట్విస్టులు ఉన్న సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.