Nikhat Zareen With Kapil Sharma: కపిల్ శర్మ షోలో ‘నిఖత్ జరీన్’.. ఆసక్తి రేపుతున్న ప్రోమో!
కపిల్ శర్మ కామెడీ షోలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
- By Balu J Updated On - 12:24 PM, Mon - 5 September 22

కపిల్ శర్మ కామెడీ షోలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ షోలో పాల్గొనేందుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆసక్తి చూపుతుంటారు. టైమింగ్ పంచులతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో సాగే ఈ షో ఇతర షోల కంటే ముందు వరుసలో ఉంటుంది. త్వరలో టెలికాస్ట్ కాబోయే షో తెలంగాణ బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ కనిపించబోతోంది. కౌన్ బనేగా కరోడ్‌పతి 14లో పాల్గొన్న CWG 2022 గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్ ది కపిల్ శర్మ షో సీజన్ 4లో ఆకట్టుకుంది.
ఈ షో సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఇది ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం చేయబడుతుంది. సీజన్ మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, పీవీ సింధు కూడా ఈ షోలో సందడి చేశారు. ‘‘మీ షోకి వచ్చే అందమైన హీరోయిన్స్ తో రోమాన్స్ చేస్తావ్.. మాతో ఎందుకు సరసాలు ఆడటం లేదు’ అని నిఖత్ కపిల్ ను ప్రశ్నించగా.. దానికి కపిల్ శర్మ సమాధానమిస్తూ.. బాక్సింగ్ గ్లోవ్స్ వైపు చూపిస్తూ.. నా షోకు వచ్చే హీరోయిన్స్ వీటిని ధరించరు కదా’’ అని ఫన్నీగా చెప్పాడు. ఎంతో ఆసక్తిగా సాగిన ఈ షో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. కొత్తగా ఓ ఐదుగురు కామెడియన్లు ఈ షో ద్వారా పరిచయం కానున్నారు.
Related News

Prabhas and Hrithik: పఠాన్ ఎఫెక్ట్.. బాలీవుడ్ లో మరో భారీ మూవీ.. ప్రభాస్ తో హృతిక్!
మరో బాలీవుడ్ మూవీలో ప్రభాస్ (Prabhas) నటించబోతున్నట్టు తెలుస్తోంది.