Raja Saab : రాజాసాబ్ నుండి మరో పోస్టర్ వచ్చేసిందోచ్
Raja Saab : 'రాజాసాబ్' కథాంశం ఒక పురాతన మహల్ చుట్టూ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒక రాజు తాను మాత్రమే అనుభవించాలనుకునే సంపద, దానికి అనుకోకుండా వచ్చే రాజా అలియాస్ ప్రభాస్ కథ ఈ సినిమా
- By Sudheer Published Date - 07:41 PM, Sun - 17 August 25

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ (Rajasaab) సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మొదట్లో మారుతి దర్శకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రభాస్ అభిమానులు, సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలు, ఆ తర్వాత విడుదలైన గ్లింప్స్, టీజర్ చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్, మారుతి మేకింగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్‌లోని ప్రతి షాట్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్యాండిల్స్ ముందు పెట్టుకుని ప్రెయర్ చేస్తున్నట్లు పోస్టర్‌లో చూపించారు. ‘రాజాసాబ్’ టీజర్ విడుదలైన తర్వాత, ఒకప్పుడు మారుతిని వ్యతిరేకించిన అభిమానులే ఇప్పుడు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీజర్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో దీని ద్వారా అర్థమవుతుంది. దాదాపు 2 నిమిషాల 20 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్, మారుతి దర్శకత్వ ప్రతిభను మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ప్రభాస్‌లోని హాస్యం, రొమాంటిక్ యాంగిల్‌ను చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఆ కోరికను తీర్చబోతోందని స్పష్టమైంది.
Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!
‘రాజాసాబ్’ కథాంశం ఒక పురాతన మహల్ చుట్టూ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒక రాజు తాను మాత్రమే అనుభవించాలనుకునే సంపద, దానికి అనుకోకుండా వచ్చే రాజా అలియాస్ ప్రభాస్ కథ ఈ సినిమా. ముగ్గురు హీరోయిన్ల పాత్రలు, ప్రభాస్ తాత ప్రస్తావన, ఆ మహల్‌లో జరిగిన సంఘటనలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి, ‘రాజాసాబ్’ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పెద్ద సంచలనంగా మారబోతోందని చెప్పడంలో సందేహం లేదు.