Pushpa 2 : పుష్ప2 మరో రికార్డు.. ఓటీటీ రైట్స్ కోసం ఎగబడ్డ ఓటీటీలు.. డీల్ ఎంతో తెలుసా?
పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
- By Balu J Published Date - 01:38 PM, Mon - 27 November 23

Pushpa 2 : పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పుష్ప మూవీ సృష్టించిన రికార్డులు ఏ మూవీ కూడా చేయలేదు. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. యావత్ దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీల రికార్డులను కూడా బద్దలు కొట్టింది. దేశమంతా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బెస్ట్ పాన్ ఇండియా మూవీగా శెభాష్ అనిపించుకుంది. అసలు బాలీవుడ్ లో అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఏ రికార్డును ఏ బాలీవుడ్ మూవీ కూడా ఇప్పటి వరకు క్రాస్ చేయలేకపోయింది.
పుష్ప రికార్డులు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అంతకుమించి అన్నట్టుగా సుకుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప కంటే కూడా మరింత పవర్ ఫుల్ రోల్ లో ఈసారి పుష్ప2లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అయితే.. పుష్ప2 కూడా రిలీజ్ కాకముందే ఎన్నో రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా పుష్ప2 మరో రికార్డును తిరగరాసింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం సినిమా విడుదల కాకముందే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎగబడ్డాయి. మాకంటే మాకు అంటూ ఎంత పెట్టి కొనడానికైనా రెడీ అయ్యాయి. అయితే.. దీని ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కు దక్కాయట.
డీల్ ఎంతో తెలుసా? రూ.30 కోట్లు పెట్టి మరీ నెట్ ఫ్లిక్స్ పుష్ప2 రైట్స్ ను దక్కించుకుందట. అమెజాన్ ప్రైమ్ కూడా భారీగానే ఆఫర్ చేసినా.. చివరకు ఆ డీల్ నెట్ ఫ్లిక్స్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. నెట్ ఫ్లిక్స్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పుష్ప 2 రిలీజ్ కాకముందే ఇలా రికార్డులు బ్రేక్ చేస్తే రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.