Tillu Square : నెట్‌ఫ్లిక్స్ చేతికి ‘టిల్లు స్క్వేర్’ ..
- Author : Sudheer
Date : 21-02-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) . ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడం తో ఈ సీక్వెల్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , స్టిల్స్ , టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేయడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు , సినీ లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix ) భారీ ధరకు దక్కించుకుంది. దాదాపు రూ.35 కోట్లకు (35 crores) కొనుగోలు చేసినట్లు సమాచారం. యంగ్ హీరో సినిమాకు ఇటీవల కాలంలో ఇంత పెద్ద డీల్ కుదరడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో థియేటర్ రైట్స్ కు పోటీగా ఓటిటి రైట్స్ ను కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం సినీ లవర్స్ ఎక్కువగా ఓటిటి కి అలవాటు పడడమే. థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అంత ఓటిటి లలోనే సినిమాలు చూస్తుండడం తో నిర్మాతలు సైతం ఓటిటి కి భారీ ధరలు చెపుతున్నారు. అయినప్పటికీ ఓటిటి సంస్థలు ఏమాత్రం ఆలోచించకుండా క్రేజ్ ఉన్న సినిమాలను భారీ ధరలకు రైట్స్ దక్కించుకుంటున్నారు. మరి మన డీజే ఏంచేస్థాడో చూడాలి.
Read Also : Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు