Rajamouli : రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తీస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ చూశారా?
తాజాగా రాజమౌళిపై తెరకెక్కించిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ ని విడుదల చేశారు.
- By News Desk Published Date - 02:50 PM, Mon - 22 July 24

Rajamouli : మన తెలుగు సినిమాలని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస హిట్స్ తో భారీ సినిమాలతో సరికొత్త కథలతో రాజమౌళి ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు. బాహుబలి, RRR సినిమాలతో మన టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి తెలిసి హాలీవుడ్ ఫిలిం మేకర్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు.
ఇంత గొప్ప ఘనత సాధించిన రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్(Netflix) ఓ డాక్యుమెంటరీ ని తెరకెక్కించింది. ‘మోడ్రన్ మాస్టర్స్'(Modern Masters) అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఆగస్టు 2 నుంచి ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా రాజమౌళిపై తెరకెక్కించిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ ని విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, కరణ్ జోహార్, కీరవాణి, రమా రాజమౌళి.. ఇలా పలువురు రాజమౌళి గురించి మాట్లాడారు. రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ట్రైలర్ లో రాజమౌళి వర్కింగ్ వీడియోస్ కూడా చూపించారు. చివర్లో రాజమౌళి కూడా మాట్లాడారు. ఈ ట్రైలర్ తో మోడ్రన్ మాస్టర్స్ పై అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ట్రైలర్ చూసేయండి..
Also Read : Ram Charan : చరణ్ నో చెప్పడంతో ఆ హీరో దగ్గరకు డైరెక్టర్..!