Nepotism: బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదు.. ఆ అవార్డుల ప్రకటనపై కంగనా ఫైర్!
బీటౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. దీంతో నెట్టింట వార్తల్లో నిలుస్తుంటుంది.
- By Dinesh Akula Published Date - 08:14 PM, Tue - 21 February 23

Nepotism: బీటౌన్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. దీంతో నెట్టింట వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని కంగనా మండిపడ్డారు.
ముంబైలో సోమవారం రాత్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం 2023 జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉత్తమ నటి, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో ఆలియాభట్, రణబీర్ కపూర్‌లకు అవార్డులు వరించాయి. దీనిపై కంగనా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నెపోటిజం వల్లే ఆలియా-రణబీర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించారు. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితాను ట్విట్టర్‌లో ఆమె పంచుకున్నారు.
బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదు. అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారు. నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోంది. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందట్లేదని మండిపడింది. అందుకే ఈ సారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అర్హత వీరికే ఉంది అంటూ ఓ జాబితాను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
గంగూబాయి కథియావాడీ సినిమాకుగానూ ఉత్తమ నటి కేటగిరీలో ఆలియాభట్ అవార్డును అందుకుంది. అదే విధంగా ఆలియా భర్త రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ హాజరుకాకపోవడంతో భర్త తరపున ఆలియానే ఈ అవార్డును కూడా అందుకున్నారు.
అంతర్జాతీయంగా అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ అవార్డుల వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ‘ఫిలిం ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకుంది. కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి దక్కించుకున్నాడు.

Related News

Priyanka Chopra: మరో ఆసక్తికర విషయం షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. ఈసారి తన వ్యక్తిగత విషయం..!
స్వదేశంలోనూ, విదేశాల్లోనూ తన సత్తా చాటిన నటీమణుల్లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఒకరు. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని వదిలి హాలీవుడ్‌కు వెళుతున్నట్లు వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈరోజు మరోసారి ప్రియాంక తన వ్యక్తిగత జీవిత రహస్యాన్ని బయటపెట్టింది.