Prabhas Fans: ఆదిపురుష్ కు నెగిటివ్ రివ్యూ.. యువకుడిని చితకబాదిన ప్రభాస్ ఫ్యాన్స్!
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ విడుదలైంది. మూవీకి బ్యాడ్ రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఓ యువకుడిని చితకబాదారు.
- By Balu J Published Date - 03:15 PM, Fri - 16 June 23

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీతో రాముడిగా కనిపించాడు ప్రభాస్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ మూవీ విడుదలైంది. తొలిరోజు తొలి షో ఉదయం 4 గంటలకు ప్రారంభం కాగానే సినిమా చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున థియేటర్లకు చేరుకున్నారు. ప్రభాస్ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. అయితే హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూసి ఆదిపురుష్ పై ఓ సినీ ప్రేక్షకుడు నెగిటివ్‌గా రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్ అభిమానులు వాగ్వాదానికి దిగారు.
ప్రభాస్‌పై బ్యాడ్ రివ్యూ ఇచ్చినందుకు సినీ ప్రేక్షకుడిని ప్రభాస్ అభిమానులు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చూసిన తర్వాత ఓ సినీ ప్రేక్షకుడు మీడియాకు తన రివ్యూ ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఈ చిత్రం VFX ప్లేస్టేషన్ గ్రాఫిక్స్ కంటే అధ్వాన్నంగా ఉందని, రాముడి పాత్రలో ప్రభాస్ సరిపోలేదని, అతని పెర్ఫార్మెన్స్ అస్సలు బాగా లేదని అతను చెప్పాడు. అతని రివ్యూని వింటున్న డార్లింగ్ అభిమానులు దాడి చేసి దూశించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో చోటుచేసుకుంది.
Also Read: Adipurush Review: మోడ్రన్ రామాయణం.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే!