Neena Gupta: ఆ ముగ్గురు హీరోయిన్స్ అంటే ఈర్ష్యగా ఉంది: నీనా గుప్తా
మెట్ గాలా ఈవెంట్‌కి ఇటీవల ప్రియాంక చోప్రా, అలియా భట్ హాజరయ్యారు. అదే సమయంలో, దీపికా పదుకొనే ఆస్కార్ 2023లో కనిపించింది. ఇప్పుడు దీనిపై నీనా గుప్తా తన మనసులో మాటని బయటపెట్టింది
- Author : Praveen Aluthuru
Date : 06-05-2023 - 5:18 IST
Published By : Hashtagu Telugu Desk
Neena Gupta: మెట్ గాలా ఈవెంట్‌కి ఇటీవల ప్రియాంక చోప్రా, అలియా భట్ హాజరయ్యారు. అదే సమయంలో, దీపికా పదుకొనే ఆస్కార్ 2023లో కనిపించింది. ఇప్పుడు దీనిపై నీనా గుప్తా తన మనసులో మాటని బయటపెట్టింది. ఈ ముగ్గురిని చూసి అసూయ పడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిందామె.
నీనా గుప్తా తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ యువ నటీమణులను అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆహ్వానించడంపై మాట్లాడారు. యువ తరం అంతర్జాతీయ స్థాయిలో కూడా దూసుకుపోతున్నారని ఆమె అన్నారు. ‘ప్రియాంక చోప్రా, అలియా భట్ మరియు దీపికా పదుకొణె లాంటి గ్లోబల్ ఎక్స్‌పోజర్‌ని మనం కూడా మన కాలంలో పొంది ఉంటే బాగుండేది’ అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఈ నటీమణులను చూస్తుంటే తనకు ఈర్ష్య కలుగుతుందని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారామె.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. మనకు కూడా ఇలాంటి ఎక్స్‌పోజర్ లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తాను. ఆ హీరోయిన్స్ ని చూసి నేను అసూయపడుతున్నాను. నేనుకూడా యువ నటిని అయితే చాలా సాధించేదాన్ని. ఆ పొడవాటి గౌనులలో రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న వారిని చూస్తే నాకు ఈర్ష్య అనిపిస్తుంది అని చమత్కరించారు. తనను ఎప్పుడైనా అంతర్జాతీయ ఈవెంట్‌కు ఆహ్వానించినట్లయితే, తన కుమార్తె మసాబా గుప్తా డిజైన్ చేసిన దుస్తులలో నడుస్తానని నీనా గుప్తా చెప్పారు. నీనా గుప్తా ఇటీవలే మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేలో కనిపించింది. ఆమె ఇటీవలే చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ షూటింగ్‌ను కంప్లీట్ చేశారు. దీని తర్వాత ఆమె ‘మెట్రో ఇన్ డినాన్’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. .
95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు దీపికా పదుకొణె వ్యాఖ్యాతగా హాజరైన సంగతి తెలిసిందే. మెట్ గాలా ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా, అలియా భట్ హాజరయ్యారు.
Read More: The Kerala Story : మణిపూర్ మండుతుంటే .. సినిమాను మోడీ ప్రమోట్ చేస్తున్నారు : అసద్