NBK108 Update: రేపు బాలయ్య బాబు బర్త్ డే.. NBK108 టీజర్ వచ్చేస్తోంది!
బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 10.19గంటలకు "భగవంత్ కేసరి" టీజర్ ను విడుదల చేయనున్నారు.
- By Balu J Published Date - 05:59 PM, Fri - 9 June 23

అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై బాలకృష్ణ 108వ చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ నెల 10న 108 థియేటర్లలో టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫైనల్ కంటెంట్ చెకింగ్ పూర్తయిదంటూ అనిల్‌రావిపూడి, సంగీత దర్శకుడు తమన్ ఓ సర్టిఫికెట్‌ను షేర్ చేశారు. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 10.19గంటలకు ప్రపంచ వ్యాప్తంగా 108 థియేటర్లలో “భగవంత్ కేసరి” టీజర్ ను విడుదల చేయనున్నారు.
బాలయ్య పుట్టినరోజు వస్తుండగా.. ఆయన అభిమానులకు ముందుగానే పండగ వాతావరణాన్ని తీసుకొస్తూ ఇప్పటికే 108వ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ పోస్టర్ వదిలారు. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన పాత్ర పేరే సినిమా టైటిల్‌గా పెట్టారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. రేపు బాలయ్య కోసం టీజర్ ను ప్లాన్ చేశారు చిత్ర నిర్మాతలు.
Also Read: Hyderabad Priest: ప్రేమ పేరుతో మహిళను లొంగదీసుకున్న పూజారి, ఆపై దారుణ హత్య!