Nayantara Sensational Decision: నయనతార సంచలన నిర్ణయం
నయనతార తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో (Social Media) ఓ కథనం.
- Author : Maheswara Rao Nadella
Date : 11-02-2023 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
నయనతార (Nayantara) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ కథనం. ఆమె ఇకపై తమిళ స్టార్ అజిత్ సరసన నటించబోనని శపథం చేసిందనేది ఈ వార్త . తన భర్త విఘ్నేశ్ శివన్‌కు జరిగిన అవమానమే దీనికి కారణమట. పూర్వాపరాల్లోకి వెళితే.. నయనతార (Nayantara) భర్త విఘ్నేశ్ శివన్..అజిత్‌తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. సినిమాకు సంబంధించి కథ నచ్చలేదంటూ అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇటీవల అభిప్రాయపడ్డాయట. ఈ కారణంతోనే ప్రాజెక్టు నుంచి విఘ్నేశ్ శివన్‌ను తప్పించాయట.
ఇక భర్త తరపున రంగంలోకి దిగిన నయన్.. అజిత్, లైకా ప్రొడెక్షన్స్‌తో సామరస్య పరిష్కారానికి ప్రయత్నించిందని సోషల్ మీడియాలో టాక్. కానీ.. ఆమె ప్రయత్నం ఫలించకపోవడంతో ఇకపై అజిత్‌తో సినిమాలు చేయబోనని ఆమె డిసైడైనట్టు టాక్. ఇక హిట్ పెయిర్‌గా పేరు పడ్డ నయన్, అజిత్ పలు సినిమాల్లో అభిమానులను అలరించారు. వారిద్దరూ కలిసి నటించిన బిల్లా, ఆరంభం, విశ్వాసం సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. దీంతో.. నయన్ ఇకపై అజిత్ సరసన కనిపించదన్న వార్త అభిమానులనూ షాక్‌కు గురిచేస్తోంది.
Also Read: 10 Tips to Stop Joint Pain: కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే 10 చిట్కాలు