Navdeep : కాలికి గాయం.. రెస్ట్ మోడ్‌లో నవదీప్.. ఎంజాయ్ చేస్తున్న తేజస్వి..
తాజాగా నవదీప్ షూటింగ్ లో గాయపడినట్టు సమాచారం. దీంతో కాలికి గాయం అయింది. నవదీప్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
- By News Desk Published Date - 07:00 PM, Thu - 6 July 23

జై(Jai) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్(Navdeep) ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఓటీటీ(OTT)లో వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు నవదీప్. ఇక 37 ఏళ్ళు వచ్చినా ఈ బాబు మాత్రం పెళ్లి మాట ఎత్తట్లేదు. ఒకవేళ అడిగినా పెళ్లి చేసుకోను అనే చెప్తున్నాడు.
తాజాగా నవదీప్ షూటింగ్ లో గాయపడినట్టు సమాచారం. దీంతో కాలికి గాయం అయింది. నవదీప్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నవదీప్ కాలికి కట్టు ఉండగా కూర్చొని బాధపడుతుంటే పక్కన తేజస్వి పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
నవదీప్ త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, కొంతమంది అతను బాధలో ఉంటే ఆలా ఎంజాయ్ చేస్తావేంటి అని తేజస్విని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ గతంలో కొన్ని సినిమాల్లో కలిసి పనిచేశారు. అప్పట్నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ స్నేహంతోనే సరదాగా ఇలా చేస్తుందని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Samantha-Vijay: విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాలు, వీడియో వైరల్