Nani Saripoda Shanivaram First Glimpse : నాని మాస్ మేనియా చూపించేలా సరిపోదా శనివారం టీజర్..!
Nani Saripoda Shanivaram First Glimpse న్యాచురల్ స్టార్ నాని వివ్కే ఆత్రేయ ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న
- By Ramesh Published Date - 08:34 PM, Sat - 24 February 24
Nani Saripoda Shanivaram First Glimpse న్యాచురల్ స్టార్ నాని వివ్కే ఆత్రేయ ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తే శనివారం మాత్రమే కోపం వచ్చే హీరోగా నాని ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు.
వివేక్ ఆత్రేయ కూడా ఈ సినిమాను కంప్లీట్ కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. నాని మాస్ అంటే అదోరకం అనేలా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టీజర్ లో కంటెంట్ తెలిసిపోయింది. సరైన కంటెంట్ పడితే నాని చేసే హంగామా కూడా తెలిసిందే. సో నాని సరిపోదా శనివారం మరో హిట్ సినిమా లోడింగ్ అని చెప్పొచ్చు.
నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అప్పట్లో ఆగష్టు 15న రిలీజ్ డేట్ వేయగా లేటెస్ట్ గా అది కాస్త మరో రెండు వారాలు పొడిగించారు. ఫైనల్ గా ఆగష్టు 29న లాక్ చేశారు. నాని కమర్షియల్ యాంగిల్ లో చేసిన ఈ సరిపోదా శనివారం ఎలా ఉండబోతుందో చూడాలి.