HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Natural Star Nani Fabulous Speech About Shyam Singha Roy

Nani : మ‌ళ్లీ చెప్తున్నా.. ఈ క్రిస్ట‌మ‌స్ మాత్రం మ‌న‌దే..!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Author : Balu J Date : 15-12-2021 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nani
Nani

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.

ఈ సందర్భంగా మంగళ వారం నాడు వరంగల్‌లో ఏర్పాటు చేసిన శ్యామ్ సింగ‌రాయ్ రాయల్ ఈవెంట్లో నాని మాట్లాడారు. ‘కళ్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలంతా కూడా సుమ డేట్ల గురించి ఎదురుచూస్తుంటారు. అదే మీరు.. అదే నేను.. అదే పల్లవి.. అంతకు మించిన రిజల్ట్ ఈ 24న చూడబోతోన్నారు. ఎంసీఏ బ్లాక్ బస్టర్ కదా? అని ఇక్కడకు  రాలేదు. ఇక్కడ ఏదో ఒక పాజిటివ్ ఉంది.. మళ్లీ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు.. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. సాయి పల్లవి నుంచి మీరు ఎంత డ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు. మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాంగ్ ఒకటి ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ పాటను విడుదల చేస్తాం. అందులో నేను నటించాల్సిన అవసరం రాలేదు. సాయి పల్లవిని చూసి అలా ఆశ్చర్యపోయాను. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడిపోతారు. కృతి శెట్టి చేసింది ఒక్క సినిమానే. ఈ పాత్రను అర్థం చేసుకుంటుందా? లేదా? అని అనుకున్నాను. కానీ ప్రతీ రోజూ సెట్‌లో ఆమె తన పాత్ర కోసం కేర్ తీసుకునేది. భవిష్యత్తులో ఆమె ఇంకా ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. సిరివెన్నె చివరి పాట కూడా బాగా హైలైట్ అయ్యింది.

కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు ఎంతో స్వీట్ పర్సన్. రాహుల్‌ గారిది ఇదో రెండో సినిమా అని అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు’ అని అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు.

దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘సిరివెన్నెల శాస్త్రిగారు ఎక్కడున్నా మనల్ని చూస్తుంటారు. మీ పాటలను మేం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే  ఉంటాం. నిర్మాత వెంకట్ గారు ఒక హిట్ సినిమా తీయాలని అనేవారు. ఆయనకు నాని దొరికారు. దర్శక నిర్మాతలు కొత్తవారైనా కూడా నాని ఈ సినిమాను భుజ స్కంధాల మీద మోశారు. మామూలుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నాచురల్ స్టార్‌గా ఎదిగారు. సినిమా సినిమాకు ఎదిగి ఇండస్ట్రీలో ఒక స్టార్‌గా ఎదిగారు. ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలి. నీ నమ్మకమే ఈ సినిమా. అది అందరికీ తెలుసు. 24న అది నిజమవ్వాలి. టీజర్ రోజున ఆ విషయాన్ని నాని కూడా చెప్పాడు. మా ఫిదా హీరోయిన్ సాయి పల్లవి. ఆమె ఏ సినిమాలో కనిపించినా కూడా అద్భుతంగా నటిస్తారు. మళ్లీ సాయి పల్లవి మ్యాజిక్ చేస్తారు. ఇక బేబమ్మ కూడా మొదటి సినిమాతో మంచి హిట్ కొట్టింది. మళ్లీ ఈ సినిమాతో వస్తోంది. దయాకరన్న వల్లే ఈ ఈవెంట్‌ను ఇక్కడ ప్లాన్ చేశాం. ఆయనే అన్నీ ఏర్పాట్లు చూసుకుంటారు. ఎంసీఏ షూటింగ్, ఈవెంట్‌ను ఇక్కడే  చేశాం. అదే సెంటిమెంట్ ఫాలో అవ్వాలని ఈ రోజు ఈవెంట్‌ను ఇక్కడ చేయాలని హీరో, నిర్మాతలు అడిగారు. మాస్కులు ధరించి థియేటర్లకు వెళ్లండి’ అని అన్నారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి. మా నాని గారు, సాయి పల్లవి గారిని, కృతి శెట్టి గారిని ఆశీర్వదించండి’ అని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • event
  • hero nani
  • tollywood
  • warangal

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd