Nara Lokesh : నీకు లోకేష్ ఇష్టమా… నారా రోహిత్ ఆన్సర్ ఏంచెప్పాడో తెలుసా..?
Nara Lokesh : భైరవం హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సరదాగా ముచ్చటించారు
- By Sudheer Published Date - 10:21 PM, Fri - 16 May 25

తమిళంలో సూపర్‌హిట్ అయిన “గరుడన్” మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న “భైరవం” సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడటంతో ‘భైరవం’కి మంచి లైన్ క్లియర్ అయ్యింది.
Land Disputes : ఏపీలో ఇక భూ వివాదాలు అనేవి ఉండవు..ఎందుకంటే !!
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ క్రమంలో భైరవం హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సరదాగా ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో జరిగిన ఫన్నీ డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ “మన ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా ఎవరిని పిలుద్దాం?” అని అడగగా, మనోజ్ నారా లోకేష్ గురించి మురిపెంగా మాట్లాడటం, రోహిత్‌కు ప్రశ్నలు వేయడం వినోదాన్ని పంచింది.
నారా రోహిత్‌కు “లోకేష్‌గారు ఇష్టమా? నేనంటే ఇష్టమా?” అని మంచు మనోజ్ ప్రశ్నించగా, “నా మా అన్నే ఇష్టం” అంటూ సరదాగా స్పందించాడు. దీనిపై మనోజ్ “అంటే నేనేనా? నేను నీకు అన్న అవుతానా, బావ అవుతానా?” అని అన్నప్పుడు, నారా రోహిత్ “బావే అవుతావ్” అంటూ నవ్వులు పంచాడు. ఈ చాటింగ్‌తో పాటుగా వారి మధ్య ఉండే స్నేహ బంధం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘భైరవం’ మూవీతో ఈ ముగ్గురు హీరోలు తిరిగి హిట్ ట్రాక్‌లోకి వస్తారనే ఆశలు అభిమానులలో నెలకొన్నాయి.