Nara Rohit : నారా రోహిత్ తన ప్రేమ విషయం ముందుగా ఎవరికీ చెప్పాడు..?
nara rohit engagement : ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆన్ స్క్రీన్ పై జంట గా కనిపించిన వీరు ఇప్పుడు రియల్ జంటగా మారారు. ప్రతినిధి 2 టైంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది
- Author : Sudheer
Date : 14-10-2024 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొన్నటి వరకు Most Eligible Bachelor గా ఉన్న హీరోలంతా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్లు పెళ్లి చేసుకోగా..తాజాగా బాణం ఫేమ్ నారా రోహిత్ (Nara Rohit) సైతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. నిన్న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి-2లో హీరోయిన్ గా కనిపించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆన్ స్క్రీన్ పై జంట గా కనిపించిన వీరు ఇప్పుడు రియల్ జంటగా మారారు. ప్రతినిధి 2 టైంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది. నారా రోహిత్ లేటుగా పెళ్లి చేసుకుంటున్నా కూడా నచ్చిన, మెచ్చిన ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక రోహిత్ తన ప్రేమ విషయాన్నీ ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పాడట. రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత… భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో ఆదివారం నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇక ఈ ఏడాది ఆఖరిలో నారా రోహిత్ వివాహం జరిపేందుకు పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రోహిత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుందరకాండ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు.
Read Also : Dasara Liquor Sales in Telangana : తెలంగాణ లో రికార్డు బ్రేక్ చేసిన మద్యం అమ్మకాలు..