Nani : నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట.. మరో నిర్మాత చేతిలోకి..
నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట. డివివి నుంచి మరో నిర్మాత చేతిలోకి..
- By News Desk Published Date - 06:36 PM, Thu - 16 May 24

Nani : నానితో ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా నిర్మిస్తున్న డివివి దానయ్య.. ఈ హీరోతో మరో సినిమాకి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. కేవలం అగ్రిమెంట్ మాత్రమే కాదు, కథని ఎంపిక చేయడం, దర్శకుడితో ఆ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం డివివి నిర్మాణంలోనే పవన్ కళ్యాణ్ తో ‘ఓజి’ సినిమా చేస్తున్న సుజిత్ దర్శకత్వంలో నాని సినిమాని తెరకెక్కించడానికి డివివి ప్లాన్ వేశారు.
నాని పుట్టినరోజు నాడు ఈ మూవీని కాన్సెప్ట్ టీజర్ తో అనౌన్స్ చేసారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఆ సినిమా కథ ఉండబోతుంది. ఈ స్టైల్ ఆఫ్ స్టోరీలో నాని ఇప్పటి వరకు నటించలేదు. దీంతో ఈ మూవీ పై నాని అభిమానులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఓ న్యూస్.. నాని అభిమానులకు షాక్ ఇచ్చింది. బడ్జెట్ కారణాలు వల్ల నిర్మాత డివివి.. ఈ ప్రాజెక్ట్ ని నిలిపివేశారంటూ ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ వార్తతో నాని అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా ఆగిపోవడం లేదంట, మరో నిర్మాత చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్తుందట. డివివి ఈ ప్రాజెక్ట్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన ఓ నిర్మాణ సంస్థ.. ఆ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందట. ఆ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని గట్టిగా వినిపిస్తుంది.
కాగా నాని అభిమానులు ఈ వార్త నిజమైతే బాగుండని ఆశ పడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ని డివివి సంస్థ.. మరి ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చి నాని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందా..? లేదా ఆ ప్రాజెక్ట్ లోకి మరో హీరోని తీసుకు వస్తుందా..? అనేది చూడాలి.