Sraddha Srinath for Balakrishna : బాలయ్యకు జోడీగా నాని హీరోయిన్..!
Sraddha Srinath for Balakrishna నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్న
- Author : Ramesh
Date : 01-02-2024 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
Sraddha Srinath for Balakrishna నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా విషయంలో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
We’re now on WhatsApp : Click to Join
సినిమాలో హీరోయిన్ గా నాని హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. నాని తో కలిసి జెర్సీ సినిమా చేసిన శ్రద్ధ శ్రీనాథ్ ని బాలకృష్ణ హీరోయిన్ గా కన్ ఫర్మ్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఆమె కూడా షూటింగ్ లో పాల్గొన్నదని తెలుస్తుంది.
బాలకృష్ణ బాబీ ఈ క్రేజీ కాంబో సినిమాలో రెండు డిఫరెంట్ యాంగిల్ లో బాలకృష్ణ (Balakrishna) రోల్ ఉంటుందని తెలుస్తుంది. బాలయ్యకు జతగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. రీసెంట్ గా అమ్మడు వెంకటేష్ సైంధవ్ సినిమాలో నటించింది. నాని జెర్సీ తర్వాత తెలుగులో ఆది సాయి కుమార్ తో ఒక సినిమా చేసిన శ్రద్ధ శ్రీనాథ్ ఆ తర్వాత కనిపించలేదు. వెంకటేష్ సైంధవ్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.
అయితే బాలకృష్ణ సినిమాతో ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా ఆమెకు ప్రత్యేకమైన క్రేజ్ తెస్తుందేమో చూడాలి. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమా పట్ల నందమూరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో అఖండ 2 వస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది.
Also Read : Kalki 2898 AD: ప్రభాస్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్, నాని