Nani: ఆ స్టార్ హీరో బయోపిక్ కి నేను రెడీ అంటున్న నాని..!
Nani న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా జరిగిన కార్తీ జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు. అక్కడ సుమ ఇంటరాక్షన్ లో భాగంగా తనకు సూపర్ స్టార్ రజినికాంత్
- By Ramesh Published Date - 11:41 PM, Sat - 4 November 23

Nani న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా జరిగిన కార్తీ జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు. అక్కడ సుమ ఇంటరాక్షన్ లో భాగంగా తనకు సూపర్ స్టార్ రజినికాంత్ బయోపిక్ చేయాలని ఉందని అన్నారు. స్టార్స్ బయోపిక్ సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. ఇక అది తలైవా రజిని బయోపిక్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. రజిని బయోపిక్ అయితే మాత్రం కచ్చితంగా తాను సిద్ధమే అని అంటున్నాడు నాని.
అంతేకాదు నాని, కార్తీ (Karthi)లను ఇద్దరిని ఇరికించేలా సుమ (Suma) ప్రశ్నలు ఉన్నాయి. ఇద్దరి సినిమాల్లో స్వాప్ చేయాలంటే నాని సినిమా ఏది కార్తీ చేయాలని.. ఏది కార్తీ సినిమా నాని చేయాలని అడిగారు. అయితే కార్తీ నాని నా పేరు శివ టైప్ సినిమాలు చ్స్తే బాగుంటుంది అన్నారు. ఇక మరోపక్క నాని తను నటించిన దసరా సినిమా తరహాలో కార్తీ ఒక సినిమా చేయాలని అన్నారు.
ఇద్దరు కలీ మల్టీస్టారర్ చేయరా అంటే.. ఎందుకు చేయ్యం అందుకు మేమిద్దరం రెడీ అనేశారు. అలా నాని కార్తీ ఇద్దరిని సుమ ప్రశ్నోత్తరాలతో అదరగొట్టేసింది. అంతేకాదు కార్తీ ఎప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తుంటాడు. తెలుగు ఆడియన్స్ కి తెలుగు వాడిగా ఓన్ చేసుకుంటారు. అందుకే కర్తీకి ఇక్కడ ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని అన్నారు.
Also Read : Sunil Max : సునీల్ కి మరో బంపర్ ఆఫర్.. ఈసారి అక్కడ అవకాశం దక్కించుకున్నాడు..!
We’re now on WhatsApp : Click to Join