Sunil Max : సునీల్ కి మరో బంపర్ ఆఫర్.. ఈసారి అక్కడ అవకాశం దక్కించుకున్నాడు..!
Sunil Max అదేంటో ఎప్పుడైతే పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రతో మెప్పించాడో అప్పటి నుంచి సునీల్ కి కొత్త ఆఫర్లు వస్తున్నాయి. ఇన్నాళ్లు సునీల్ ఒక కమెడియన్
- By Ramesh Published Date - 11:25 PM, Sat - 4 November 23

Sunil Max అదేంటో ఎప్పుడైతే పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రతో మెప్పించాడో అప్పటి నుంచి సునీల్ కి కొత్త ఆఫర్లు వస్తున్నాయి. ఇన్నాళ్లు సునీల్ ఒక కమెడియన్ గా కొన్నాళ్లు హీరోగా మాత్రమే పరిచయం కానీ మన వాళ్లు అతన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. కలర్ ఫోటో తో పాటుగా పుష్ప లో సునీల్ విలనిజం మెప్పించింది. ఇది కోలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అంతే వరుసగా సునీల్ కి ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు సునీల్ నటిస్తున్న సినిమాలు కూడా హిట్లు అవుతుండటం వల్ల సునీల్ కి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.
రజిని జైలర్ (Jailer) నుంచి రాబోతున్న కార్తీ (Karthi) జపాన్ సినిమా వరకు సునీల్ వరుస ఛాన్స్ లతో అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో సునీల్ కి మరో లక్కీ ఛాన్స్ కూడా వచ్చిందని తెలుస్తుంది. కన్నడ స్టార్ సుదీప్ (Sudeep) హీరోగా వస్తున్న మ్యాక్స్ సినిమాలో సునీల్ విలన్ గా ఫిక్స్ అయ్యాడు. విజయ్ కార్తికేయన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో సునీల్ మొదటిసారి కన్నడ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు.
కమెడియన్ గా కేవలం తెలుగు ఆడియన్స్ ని మాత్రమే అలరించిన సునీల్ ఇప్పుడు తన విలక్షణ నటనతో సౌత్ సినిమాలన్నీ చేస్తున్నాడు. తెలుగులో కూడా చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. అంతేకాదు సునీల్ రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీగానే అడుతున్నాడని తెలుస్తుంది. ఎన్నిరోజులు ఈ ఫాం కొనసాగుతుందో తెలియదు కానీ సునీల్ మాత్రం అదరగొట్టేస్తున్నాడు.
Also Read : Mrunal Thakur : ఈ హీరోయిన్ డెంటల్ డాక్టరా.. ఏజ్ కూడా థర్టీ ప్లస్సా..?
We’re now on WhatsApp : Click to Join