Nandamuri Mokshagna : నందమూరి మోక్షజ్ఞ సినిమా ప్రకటనకి డేట్ ఫిక్స్..!
నందమూరి మోక్షజ్ఞ సినిమా ప్రకటనకి డేట్ ఫిక్స్ అయ్యిందట. ఎప్పుడో తెలుసా..?
- By News Desk Published Date - 07:48 PM, Tue - 3 September 24
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ తెరగేంట్రంకి అంతా సెట్ అయ్యిందట. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి అనేక వార్తలు వినిపించాయి. ఈ సినిమాని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారట. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ వర్మ.. నందమూరి వారసుడిని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి కథని సిద్ధం చేశారట.
అయితే ఈ విషయాలు గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులంతా ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎదురు చూపులకు బాలయ్య ఎండ్ కార్డు వేయబోతున్నారట. ఈ నెల 6న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. కాగా ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారట. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ ని వెండితెరకి పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారట.
అంతేకాదు, ఈ మూవీలో బాలయ్య కూడా ఒక ముఖ్య పాత్రతో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి 6వ తారీఖున కాస్టింగ్ డీటెయిల్స్ ని కూడా రివీల్ చేస్తారా లేదా చూడాలి. ఇకపోతే, ఈ చిత్రాన్ని కూడా హనుమాన్ సినిమాలా సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కించబోతున్నారట. కాగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో.. ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు నందమూరి హీరోలతో చేయబోయే సినిమాని కూడా ఆ యూనివర్స్ లోనే తెరకెక్కిస్తున్నారా..? లేదా..? అని తెలియాల్సి ఉంది.
Related News
Mokshagnya : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు.. మోక్షజ్ఞ హవా..
ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ హీరోకు చేసేంత హడావిడి మోక్షజ్ఞకు చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.