Balakrishna Unstoppable: బాలయ్య బిజీ బిజీ.. అన్‌స్టాపబుల్ కు గుడ్ బై!
నందమూరి బాలయ్య బాబు బిజీగా ఉండటంతో అన్ స్టాపబుల్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది!
- By Balu J Published Date - 01:15 PM, Wed - 1 February 23

తెలుగు ఎంటర్ టైన్ మెంట్స్ లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్” (Unstoppable) ప్రోగ్రామ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇతర షోల కంటే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. అన్ స్టాపబుల్ ను చూసేవాళ్ల సంఖ్య పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఆహా (Aha)లో ఈ ప్రోగ్రామ్ ను మించిన మరో ప్రోగ్రామ్ లేదని చెప్పక తప్పదు. మొదటి సీజన్ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుందో, రెండో సీజన్ అంతకుమించి ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో పాటు టాప్ సెలబ్రిటీస్ ప్రభాస్ లాంటివాళ్లు ఈ షో (Unstoppable) లో సందడి చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఎపిసోడ్ కూడా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. పవన్ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే త్వరలోనే రెండు సీజన్ ముగియనుంది. నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత విషయాలతో నిమగ్నమై, తన మేనల్లుడు తారకరత్న ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నందున, ఈ షోకి హోస్ట్‌గా చేయమని కోరడం సరికాదని టీమ్ భావించింది. అయితే మూడవ సీజన్ (Unstoppable) గురించి ఎటువంటి ప్రకటన లేదు. కాగా రెండవ సీజన్ కు మిశ్రమ సమీక్షలు వచ్చాయని టాక్.
Also Read: Varun Tej Marriage: పెళ్లికి సిద్దమవుతున్న ‘మెగా’ హీరో.. పెళ్లి కూతురు ఎవరో మరి!