Mahesh Birthday : నా బలం నువ్వే మహేష్ – నమ్రత ట్వీట్
Mahesh Birthday : మహేష్ తన జీవితానికి ఆనందాన్ని, బలాన్ని ఇచ్చే వ్యక్తి అని, తన జీవితాన్ని ఒక కలలా మార్చాడని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు
- By Sudheer Published Date - 08:50 PM, Sat - 9 August 25

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh) 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సతీమణి, మాజీ నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంకలో కుటుంబంతో కలిసి జరిపిన పర్యటనలోని ఒక అందమైన చిత్రాన్ని పంచుకుంటూ, మహేష్ తన జీవితానికి ఆనందాన్ని, బలాన్ని ఇచ్చే వ్యక్తి అని, తన జీవితాన్ని ఒక కలలా మార్చాడని నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు. “హ్యాపీ బర్త్ డే టూ ది మ్యాన్ హూ మేక్స్ లైఫ్ ఫీల్ లైక్ ఏ డ్రీమ్. మై లవ్, మై స్ట్రెంథ్, మై ఎవిరిథింగ్. లవ్ యూ ఆల్వేస్” అంటూ ఆమె తన ప్రేమను వ్యక్తం చేశారు.
Raksha Bandhan : రక్షాబంధన్ పండుగలో క్రికెట్ స్టార్ల సరదా సందడి.. సోదరీ-సోదరుల ఆప్యాయతలు
కేవలం నమ్రత మాత్రమే కాదు, మహేష్ పిల్లలు సితార, గౌతమ్ కూడా తమ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సితార తన చిన్ననాటి ఫోటోను పంచుకుంటూ, “హ్యాపీ బర్త్ డే టు ది బెస్ట్ డాడ్ ఎవర్. ఐ లవ్ యూ” అని పోస్ట్ చేశారు. గౌతమ్ కూడా తన తండ్రితో కలిసి దిగిన ఫోటోల కొలాజ్‌ను పంచుకుంటూ, “ఆల్వేస్ మై ఫస్ట్ హీరో. హ్యావ్ ది బెస్ట్ బర్త్ డే ఎవర్ నానా!” అని రాశారు. ఇక మహేష్‌కు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, అడవి శేష్ వంటి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెష్ అందించారు.
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో “SSMB 29” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘గ్లోబ్‌ట్రాటర్’ అనే పేరు పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి, మహేష్ ధరించే శివ లింగం లాకెట్‌ను రాజమౌళి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు నవంబర్‌లో ప్రకటిస్తామని రాజమౌళి తెలిపారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.