Namrata Shirodkar : సితార, గౌతమ్ సినీ ఎంట్రీపై మాట్లాడిన నమ్రత శిరోద్కర్.. మహేష్ వారసులు సినిమాల్లోకి ఎప్పుడు?
గతంలోనే మహేష్ సితార భవిష్యత్తులో హీరోయిన్ అవుతుంది అని చెప్పాడు. తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) సితార, గౌతమ్ సినిమా ఎంట్రీపై మాట్లాడింది.
- Author : News Desk
Date : 16-07-2023 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) వరుస సినిమాలతో అభిమానులని మెప్పిస్తూ వెళ్తున్నారు. 47 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్రాడిలా కనిపిస్తూ అలరిస్తున్నారు. ఇక మహేష్ కూతురు, తనయుడు సితార(Sitara), గౌతమ్(Gautham) కూడా ఇప్పటికే ఫేమస్ అయ్యారు. గౌతమ్ తన ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళాడు. సితార మాత్రం ఇక్కడే చదువుకుంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇటీవలే సితార ఒక యాడ్ చేసి అందర్నీ అలరించి మరింత పాపులర్ అయింది. గతంలోనే మహేష్ సితార భవిష్యత్తులో హీరోయిన్ అవుతుంది అని చెప్పాడు. తాజాగా మహేష్ భార్య నమ్రత శిరోద్కర్(Namrata Shirodkar) సితార, గౌతమ్ సినిమా ఎంట్రీపై మాట్లాడింది.
నమ్రత మాట్లాడుతూ.. గౌతమ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. వాడి ఫోకస్ అంతా తన గ్రాడ్యుయేషన్ మీదే ఉంది. కనీసం ఓ 8 ఏళ్ళ తర్వాతే గౌతమ్ సినిమాల గురించి ఆలోచిస్తాడు. అప్పుడు కూడా వాడి ఇష్టం. ఇక సితార ఇప్పట్నుంచే సినిమాల్లో నటించాలని ఆసక్తి చూపిస్తుంది. తనకి సినిమాల్లోకి రావాలని ఉంది. సినీ పరిశ్రమని కెరీర్ గా చేసుకోవచ్చు అని తెలిపింది. దీంతో త్వరలోనే సితార పాపని స్క్రీన్ మీద చూసే అవకాశాలు ఉన్నాయని మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Money movie : చిరంజీవి మూవీకి పోటీగా ‘మనీ’ విడుదల.. వర్మ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?