Christmas Celebrations : అంబరాన్ని తాకిన మెగా , ఘట్టమనేని క్రిస్మస్ సంబరాలు
- Author : Sudheer
Date : 26-12-2023 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
క్రిస్మస్ (Christmas) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సంబరాలు మొదలుపెట్టారు. సామాన్యులతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే క్రిస్మస్ సంబరాలంతా మెగా ఫ్యామిలీ (Mega Family) లోనే జరిగాయి అనేలా సంబరాలు అంబరాన్ని తాకాయి. మెగా ఫ్యామిలీ సభ్యులే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా క్రిస్మస్ వేడుకల్లో పాలుపంచుకుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఉపాసన, స్నేహారెడ్డి, నిహారిక, శ్రీజతో పాటు దాదాపు ఆ ఫ్యామిలీ యూత్ మొత్తం కలిసి క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఉపాసన – నమ్రత (Namrata Shirodkar & Upasana) లు ఇద్దరు కలిసి క్రిస్మస్ వేడుకలు కలిసి జరుపుకున్నారు. డిసెంబర్ 25 రాత్రి హైదరాబాద్ లో క్రిస్మస్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఉపాసన, నమ్రతల కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకలు కావడంతో రెడ్ అవుట్ ఫిట్ లో సందడి చేశారు. ఈ క్రిస్మస్ పార్టీ ఫోటోలు నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వేడుకల్లో నమ్రత పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార కూడా పాల్గొన్నారు. అయితే చరణ్ – మహేష్ లు మాత్రం మిస్ అయ్యారు.
Read Also : Hair Tips: హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే జుట్టుకు ఇది రాయాల్సిందే?