Nagarjuna : విజయ్ సేతుపతిని నాగార్జున అవమానించాడా..?
Nagarjuna : నాగార్జున స్వయంగా విజయ్ సేతుపతికి కాల్ చేసి, గ్రాండ్ ఫినాలేకు రావాలని కోరారట. విడుదల 2 ప్రమోషన్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న విజయ్ సేతుపతి,..నాగ్ ఆహ్వానాన్ని అంగీకరించారు.
- By Sudheer Published Date - 06:19 PM, Thu - 19 December 24

విజయ్ సేతుపతి (Vijay Sethupathi )..పరిచయం అక్కరలేని వ్యక్తి. ఎలాంటిపాత్రైనా సరే అవలీలగా చేయడమే కాదు ఆ పాత్ర ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకోవడం విజయ్ సేతుపతికి వెన్నతోపెట్టిన విద్య. విజయ్ సేతుపతి సినిమా అంటే చాలు అన్ని భాషల్లో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు సాధించాయి. అలాంటి హీరోను..కింగ్ నాగార్జున (Nagarjuna) అవమానించాడనే వార్త అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఇంతకీ అసలు ఏంజరిగిందంటే..
రీసెంట్ గా బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే (Bigg Boss 8 Telugu Grand Finale) గ్రాండ్ గా ముగిసింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోలో నిఖిల్ విజేతగా నిలిచాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరై, నిఖిల్‌కు ట్రోఫీ అందజేశాడు. అయితే వాస్తవానికి ఈ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విజయ్ సేతుపతిని బిగ్ బాస్ టీం పిలిచిందట. నాగార్జున స్వయంగా విజయ్ సేతుపతికి కాల్ చేసి, గ్రాండ్ ఫినాలేకు రావాలని కోరారట. విడుదల 2 ప్రమోషన్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న విజయ్ సేతుపతి,..నాగ్ ఆహ్వానాన్ని అంగీకరించారు.
అంతకు ముందు ఫైనల్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించారు..కాకపోతే గేమ్ ఛేంజర్ పనుల్లో రామ్ చరణ్ (Ram Charan) బిజీ గా ఉండడం తో..ఆయన వస్తారో రారో అనుకుని, అనుమానంతో విజయ్ సేతుపతిని ముఖ్య అతిథిగా నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో రామ్ చరణ్ వస్తున్నారని తెలియడంతో బిగ్ బాస్ టీం చీఫ్ గెస్ట్‌గా విజయ్ సేతుపతిని కాకుండా రామ్ చరణ్‌ను నిర్ణయించింది.
ఇదే విషయాన్నీ విజయ్ సేతుపతి చెప్పారట..అంతకు ముందే బిగ్ బాస్ ఫైనల్ కు వెళ్లాలని మిగతా పనులను పోస్ట్ చేసుకున్నారట విజయ్. ఎలాగూ పనులు పోస్ట్ ఫోన్ చేసుకున్నని చెప్పి బిగ్ బాస్ ఫైనల్ కు వెళ్లారట. ఈ పరిణామం విజయ్ సేతుపతికి అవమానంగా అనిపించిందని, ఆయన మానసికంగా నొచ్చుకున్నారని టాక్. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్‌ను ముఖ్య అతిథిగా తీసుకోవడంలో తప్పు లేదని, కానీ విజయ్ సేతుపతిని ముందుగానే విషయాన్ని చెప్పి ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Poco M7 pro: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైన పోకు సరికొత్త స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలివే?