Naga Chaitanya Youtube Channel : సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అక్కినేని హీరో
యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చారు
- Author : Sudheer
Date : 18-11-2023 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ను స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సినీ తారలు (Film Stars) మాత్రమే సెలబ్రిటీస్ అయ్యేవారు కానీ ఇప్పుడు యూట్యూబ్ (Youtube) పుణ్యమా అని ప్రతి ఒక్కరు రాత్రికి రాత్రే సెలబ్రిటీస్ గా మారిపోతున్నారు. తమ సరికొత్త ఐడియాస్ తో , టాలెంట్ లతో యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కేవలం గుర్తింపు మాత్రమే కాదు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పాపులర్ అవుతున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ సైతం సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తూ వారి తాలూకా అప్డేట్స్ ను అభిమానులకు షేర్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) సైతం సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు. ‘అక్కినేని నాగచైతన్య’ (Akkineni Naga Chaitanya) పేరుతో చానల్ స్టార్ట్ చేసిన నాగచైతన్య..అందులో ఓ వీడియో పోస్టు చేసాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు ఇచ్చారు. కాగా, నాగచైతన్య యూట్యూబ్ చానల్ ప్రారంభించిన కాసేపటికే 1 లక్షకు పైగా subscribe చేసి తమ హీరోకు మద్దతు పలికారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం చైతు కెరియర్ ఏమాత్రం గొప్పగా లేదు. ఒక్క చైతుదే కాదు అక్కినేని హీరోలందరి పరిస్థితి అలాగే ఉంది. ఓ హిట్ కోసం అక్కినేని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఆ హిట్ ఎప్పుడు కొడతారో చూడాలి.
Read Also :