Naga Chaitanya Shobhitha Wedding Card : నాగ చైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్ చూశారా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి కార్డ్..!
Naga Chaitanya Shobhitha Wedding Card చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య శోభిత పెళ్లి ముహుర్తం ఎప్పుడన్నది కార్డ్ లో మెన్షన్ చేయలేదు.
- Author : Ramesh
Date : 17-11-2024 - 12:44 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని నాగ చైతన్య శోభిత ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వారి పెళ్లి ముహుర్తం ఎప్పుడు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత పెళ్లి అని వార్తలు వచ్చినా పెళ్లి కార్డ్ వస్తేనే కానీ ఆ వార్తల్లో నిజం ఎంత అన్నది తెలుస్తుందని అనుకున్నారు. ఐతే లేటెస్ట్ గా చైతన్య, శోభిత పెళ్లి కార్డ్ కూడా వచ్చేసింది.
ముందు నుంచి చెబుతున్నట్టుగానే చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్య శోభిత పెళ్లి ముహుర్తం ఎప్పుడన్నది కార్డ్ లో మెన్షన్ చేయలేదు.
పెళ్లి వేడుక హైదరాబాద్ లోనే..
ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శోభిత ఇంట్లో పెళ్లికి సంబందించిన పనులు మొదలయ్యాయి. ఈమధ్యనే చైతన్య, శోభిత అలా విహార యాత్రకు వెళ్లొచ్చారు. ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నాగ చైతన్య పెళ్లికి అనుగుణంగా తన డేట్స్ ఖాళీ చేసుకున్నాడు.
ప్రస్తుతం చైతన్య తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండగా సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఫిషర్ మెన్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అసలైతే సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా వేశారు.
Also Read : Devi Sri Prasad : దేవి మీద సూర్య ఫ్యాన్స్ ఆగ్రహం రీజన్ ఏంటంటే..!