Naga Chaitanya : సీనియర్స్ తో ఫైట్ కి సిద్ధమైన నాగ చైతన్య..!
ఈ సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తే సీనియర్ స్టార్స్ నలుగురు మరోసారి పోటీ పడే ఛాన్స్ ఉండేది. కానీ ఈసారి నాగ్ ప్లేస్ లో నాగ చైతన్య
- By Ramesh Published Date - 08:15 AM, Sat - 21 September 24

నాగ చైతన్య లేటెస్ట్ మూవీ చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ (Geetha Arts) 2 బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టారు. నాగ చైతన్య ఈ సినిమాలో ఫిషర్ మ్యాన్ గా కనిపించనున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా తండేల్ సినిమాను డిసెంబర్ ఎండింగ్ అంటే క్రిస్ మస్ రిలీజ్ కు ప్లాన్ చేశారు.
కానీ డిసెంబర్ రేసులో పుష్ప 2, గేం చేంజర్ రావడంతో సినిమా వాయిదా వేయాలని చూస్తున్నారు. ఐతే మరీ ఎక్కువ రోజులు కాకుండా క్రిస్ మస్ కూరకపోతే 2025 సంక్రాంతికి తండేల్ (Thandel) రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తండేల్ సినిమా విషయంలో మేకర్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే పొంగల్ రేసులో దిగేందుకు అయినా రెడీ అంటున్నారు.
సంక్రాంతికి తండేల్..
ఇక సంక్రాంతికి ఇప్పటికే చిరంజీవి విశ్వంభర రిలీజ్ కన్ఫర్మ్ కాగా బాలయ్య 109వ సినిమా, వెంకటేష్ 76వ సినిమాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాలతో పాటు తండేల్ ని కూడా తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు. సీనియర్ స్టార్స్ తో నాగ చైతన్య (Naga Chaitanya) ఫైట్ కు సిద్ధమవుతున్నారు.
అసలైతే ఈ సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తే సీనియర్ స్టార్స్ నలుగురు మరోసారి పోటీ పడే ఛాన్స్ ఉండేది. కానీ ఈసారి నాగ్ ప్లేస్ లో నాగ చైతన్య వస్తున్నాడని తెలుస్తుంది. మరి నాగ చైతన్య తండేల్ రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.
Also Read : ANR National Award : చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్..!