Hyderabad Blackbirds: స్పోర్ట్స్ రేసింగ్ ఫ్రాంచైజీని దక్కించుకున్న చైతూ
అక్కినేని హీరో నాగచైతన్యకు స్పోర్ట్స్ బైక్స్, కార్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. నగరంలోకి ఏదైనా స్పోర్ట్స్ వెహికిల్ వచ్చిందంటే చాలు ఆ వెహికిల్ ని చైతూ నడపాల్సిందే.
- By Praveen Aluthuru Published Date - 11:27 PM, Thu - 14 September 23

Hyderabad Blackbirds: అక్కినేని హీరో నాగచైతన్యకు స్పోర్ట్స్ బైక్స్, కార్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. నగరంలోకి ఏదైనా స్పోర్ట్స్ వెహికిల్ వచ్చిందంటే చాలు ఆ వెహికిల్ ని చైతూ నడపాల్సిందే. అయితే తాజాగా నాగచైతన్య ఏకంగా ఓ స్పోర్ట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఈ ఏడాది జరిగే ఫార్ములా 4 ఇండియన్ చాంఫియన్‌షిప్‌లో నాగచైతన్య టీమ్ బరిలోకి దిగనుంది. ఈ టీమ్‌కు అఖిల్ రబీంద్ర, నీల్ జానీ డ్రైవర్స్‌గా కొనసాగనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తొలి సంవత్సరంలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ సత్తా చాటింది. ఇదిలా ఉండగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్ననాగచైతన్య త్వరలో చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న మూవీలో నటించనున్నారు.
Also Read: Tamil Heros : తమిళ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆ స్టార్ హీరోలపై బ్యాన్..?