ANR National Award 2024 : ఫంక్షన్లో అక్కినేని కొత్త కోడలి సందడి మాములుగా లేదు
ANR National Award 2024 : ఈ ఫంక్షన్లో కొత్త కోడలే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చైతు పక్కనే ఉంటూ.. అక్కినేని కుటుంబంతో కలిసిపోయి కలివిడిగా తిరుగుతూ కనిపించింది
- By Sudheer Published Date - 10:22 PM, Mon - 28 October 24
2024 ANR జాతీయ అవార్డు ఫంక్షన్ (ANR National Award 2024) వేడుక సోమవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి , బిగ్ బి , రామ్ చరణ్, విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, నాని, అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, సుధీర్ బాబు, నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభిత , రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది హాజరై సందడి చేసారు.
ఇటు అక్కినేని ఫ్యామిలీ సభ్యులతో పాటు నాగ చైతన్య (Naga Chaitanya) కు కాబోయే భార్య శోభిత (Sobhita Dhulipala) కూడా హాజరైంది. ఈ ఫంక్షన్లో కొత్త కోడలే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చైతు పక్కనే ఉంటూ.. అక్కినేని కుటుంబంతో కలిసిపోయి కలివిడిగా తిరుగుతూ కనిపించింది. నాగార్జున (Nagarjuna) సైతం.. కొత్త కోడలిని సెలబ్రిటీస్ కు పరిచయం చేసాడు. చివరగా.. అక్కినేని కుటుంబం మొత్తం ఏయన్నార్ అవార్డు అందుకున్న చిరుతో.. ఆ అవార్డును ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన సామ్ ఫ్యాన్స్ మాత్రం ఆ ఫొటోలో సమంత లేని లోటు కనిపిస్తుందంటూ కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : #SSRMB : రాజమౌళి – మహేష్ మూవీ రెండు పార్ట్స్..?