Nag100 : నాగార్జున 100వ మూవీలో ఆ ఇద్దరు..?
Nag100 : ఇక ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే అక్కినేని అభిమానులకు ఇది పెద్ద పండుగగా మారనుంది
- By Sudheer Published Date - 07:00 PM, Thu - 18 September 25

అక్కినేని నాగార్జున తన 100వ చిత్రంతో సినీ ప్రస్థానంలో ఒక కొత్త మైలురాయిని చేరుకోబోతున్నారు. ఈ మైలురాయి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘కింగ్ 100’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. వందో సినిమాగా రావడంతో పాటు ఇది పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునకు గణనీయమైన ఫ్యాన్ బేస్ ఉండటంతో పాటు, ఆయన వందో సినిమా కావడంతో ఇది తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద ఈవెంట్‌గా మారే అవకాశం ఉంది.
Kalki 2898 AD : కల్కి టీం కు షాక్ ఇచ్చిన దీపిక..నెక్స్ట్ ఎవరు..?
ఇక ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే అక్కినేని అభిమానులకు ఇది పెద్ద పండుగగా మారనుంది. ఒకే సినిమాలో తండ్రి–కొడుకులు కలిసి కనిపించడం చాలా అరుదైన విషయం. ముఖ్యంగా వందో సినిమాకు ఇది అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఇటువంటి కాంబినేషన్‌తో సినిమా వస్తే, అక్కినేని కుటుంబం సినీ వారసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్. కార్తీక్ తెరకెక్కించబోతున్నారు. ఆయన ఇంతకుముందు ‘ఆకాశం’ సినిమాతో వినూత్నమైన కథనాన్ని అందించారు. ఇక ‘కింగ్ 100’ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించే ప్రణాళికలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం, నటీనటుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.