Nabha Natesh : నటుడు ప్రియదర్శి పై కేసు పెడతానంటున్న నభా నటేష్.. అసలేమైంది..?
నటుడు ప్రియదర్శి పై కేసు పెడతానంటున్న నభా నటేష్. కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అంటూ..
- Author : News Desk
Date : 18-04-2024 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Nabha Natesh : అందాల భామ నభా నటేష్ ఇటీవల మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే నభా.. రీసెంట్ గా ఓ వీడియో పోస్ట్ వేశారు. ఆ వీడియో ఏంటంటే.. డార్లింగ్ అంటూ పిలుస్తున్న ప్రభాస్ వాయిస్ తో నభా డబ్‌స్మాష్ చేసారు.
ప్రభాస్ వాయిస్ కి నభా యాక్ట్ చేస్తుంటే.. చాలా క్యూట్ గా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అయ్యిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నభాకి ఫిదా అయ్యిపోయి.. ‘లవ్ యు డార్లింగే’ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక వీరికి లాగానే ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రియదర్శి రియాక్ట్ అవుతూ.. “వావ్ సూపర్ డార్లింగ్. కిర్రాక్ ఉన్నావ్ డార్లింగ్” అంటూ కామెంట్ చేసారు.
WOW Superrrrrr 🤩
Darlinggggg 😍
Kirrrraakkk Unnav Darling😘🤌🏼 https://t.co/fIYSCaCfYo— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024
ఇక దీనికి నభా రియాక్ట్ అవుతూ.. “మిస్టర్ కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు” అంటూ రీసెంట్ గా ఓ కోర్టు పాస్ చేసిన సెక్షన్ ని ట్వీట్ చేసారు. దీనికి ప్రియదర్శి సమాధానం ఇస్తూ.. “ఓహ్, అంటే మీకు మాకు అసలు పరిచయం లేదు అంటారా. అయినా మీరు డార్లింగ్ అంటే తప్పు ఉండదు. మేము అంటే మాత్రం ఐపీసీ సెక్షన్లు గుర్తుకు వస్తాయా. లైట్ తీసుకో డార్లింగ్” అంటూ బదులిచ్చారు.
Oh! I didn’t know we were “unknown”
BTW meeru ‘Darling’ anochhu, memu ante Sec 354A IPC ah? 🤯
Lite theesko Darling🤗 https://t.co/sni862gfxP
— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) April 17, 2024
ఈ ట్వీట్ కి నభా రియాక్ట్ అవుతూ.. “హద్దు దాటకు, చూసుకుందాం” అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ట్వీట్స్ వెనుక కారణం సినిమా ప్రమోషన్ అని తెలుస్తుంది. ప్రియదర్శి మెయిన్ లీడ్ తెరకెక్కుతున్న ఓ సినిమాలో నభా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనే అని తెలుస్తుంది.
Also read : OG – Mirai : మిరాయ్ మూవీతో ఓజికి పోలిక.. తేజ సజ్జ ఇంటరెస్టింగ్ కామెంట్స్..
Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di
— Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024