Nabha Natesh : కారులో దేవర పాట పెట్టుకొని.. డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్న నభా..
కారులో దేవర పాట పెట్టుకొని డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్న నభా. వైరల్ అవుతున్న వీడియో చూసారా..?
- Author : News Desk
Date : 11-07-2024 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
Nabha Natesh : టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ప్రియదర్శితో ‘డార్లింగ్’, నిఖిల్‌తో ‘స్వయంభు’ సినిమాలు చేస్తున్నారు. డార్లింగ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈక్రమంలోనే నభా నటేష్.. కారు డ్రైవ్ చేస్తూ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు నభా నటేష్.
ఇక ఈ జర్నీ మధ్యలో నభా.. కారులోని మ్యూజిక్ బాక్స్ ని ఆన్ చేసారు. రీసెంట్ చార్ట్ బస్టర్ అయిన ‘దేవర’ టైటిల్ సాంగ్ ని పెట్టుకొని ఎంజాయ్ చేసారు. కేవలం పాటని విని ఎంజాయ్ చేయడమే కాదు, ఆ పాటని హమ్ చేస్తూ.. తనకి ఆ సాంగ్ ఎంత ఇష్టమో తెలియజేసారు. ఇక నభా ఇలా ఎన్టీఆర్ పాటని పాడడం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నభా పాడిన వీడియోని నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ వీడియో వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
Heroine @NabhaNatesh Vibing For Man Of Masses @tarak9999‘s #FearSong ❤️🔥❤️🔥🥳.
All Hail The Tiger @DevaraMovie @anirudhofficial 🎵🎶🔥🐯👑. #Devara #ManOfMassesNTR #JrNTR pic.twitter.com/SbSXwLtqUf
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) July 11, 2024
ఇక డార్లింగ్ సినిమా విషయానికి వస్తే.. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నభా.. లేడీ అపరిచితుడుగా అలరించబోతున్నారు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తిగా అందర్నీ నవ్వించబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. రీ ఎంట్రీ ఇస్తున్న నభాకి, వరుస హిట్స్ లో ఉన్న ప్రియదర్శి హిట్ ఇస్తాడా లేదా చూడాలి. జులై 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.